Orissa : మైలార్డ్, యువరానర్ అనొద్దు..సార్ అని పిలవండి
మైలార్డ్, యువరానర్, అనరబుల్ అనే పదాలను ఉపయోగించవద్దని..కేవలం సర్ అంటే సరిపోతుందని న్యాయవాదులకు, వాదులకు..ప్రతివాదులకు...

Orissa
Orissa High Court : మైలార్డ్, యువరానర్, అనరబుల్ అనే పదాలను ఉపయోగించవద్దని..కేవలం సర్ అంటే సరిపోతుందని న్యాయవాదులకు, వాదులకు..ప్రతివాదులకు జస్టిస్ మురళీధర్ విజ్ఞప్తి చేశారు. ఆయన తీసుకున్న నిర్ణయానికికి హైకోర్టు బార్ అసోసియేషన్ కార్యదర్శి జేకే లెంకా స్వాగతించారు. జడ్జీలు కూడా ఇదే సూత్రాన్ని అనుసరించాలని సూచించారు. విచారణ సందర్భంగా..తనను మై లార్డ్, యువర్ లార్డ్ షిప్ అని సంబోధించరాదని స్పష్టం చేశారు.
Read More : Online Cheaters : లక్షల్లో మోసపోయిన అమాయకులు
కోర్టుల్లో బ్రిటీష్ కాలం నుంచి వస్తున్న పదజాలం నేటికి కంటిన్యూ అవుతోంది. మై లార్డ్ అనే పదం కూడా ఆ కోవలకే వస్తుంది. ఈ విషయంలో ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.మురళీధర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఈ ధర్మాసనంలోని జడ్జిలను ఎవరూ ఇకపై ‘మై లార్డ్’, ‘యువర్ లార్డ్ షిప్’, ‘యువరానర్’, లేక ‘ఆనరబుల్’ అనే పదాలను ఉపయోగించవద్దు అని సూచించారు.