డౌట్ వద్దు.. ఫుల్ అమౌంట్ వచ్చేస్తది.. అలా చెయ్యొద్దు

ప్రపంచాన్ని బయపెట్టి ఇప్పుడు మన దేశంలోకి అడుగుపెట్టి.. మానవాళిని భయపెడుతున్న కరోనా వైరస్ దెబ్బకు ప్రజారవాణ ఆగిపోయింది. ఇప్పటికే రైళ్లు, బస్సులు, విమానాలు.. ప్రతి ఒక్కటి రద్దు చేశారు అధికారులు. అయితే ఇప్పటికే ఎంతోమంది రైళ్లలో ప్రీ బుకింగ్ చేసుకోవడంతో ఆ డబ్బులు తిరిగివస్తాయో లేదో అనే అనుమానంతో ముందే క్యాన్సిల్ చేసుకోవాలని చూస్తున్నారు.
ఈ క్రమంలో దేశవ్యాప్తంగా రద్దయిన రైళ్లకు ఆన్‌లైన్లలో టికెట్లు తీసుకున్న ప్రయాణికులెవరికి డౌట్ అక్కర్లేదని, టికెట్లను రద్దు చేసుకోవద్దని ఐఆర్సీటీసీ ప్రకటనలో తెలిపింది. టికెట్‌కు కట్టిన మొత్తం డబ్బును పూర్తిగా రీఫండ్ ఇస్తామని స్పష్టం చేసింది. రైల్వే శాఖ టికెట్లను రద్దు చేసుకునేందుకు జూన్ 21 వరకు మూడు నెలల పాటు గడువు పొడగించింది.
దేశవ్యాప్తంగా ప్యాసింజర్ రైళ్లను రద్దు చేయడం వల్ల ఈ-టికెట్ రద్దుపై కొందరికి అనుమానాలు ఉన్నాయని, వినియోగదారులు తొందరపడి టికెట్లను రద్దు చేసుకోవద్దని, అలా చేసుకుంటే.. వారికి తక్కువ నగదు రీఫండ్ అయ్యే అవకాశం ఉందని రైల్వేశాఖ ప్రకటించింది. అందుకే రైల్వే శాఖ రద్దు చేసిన రైళ్లలో టికెట్లు బుక్ చేసుకున్న వారు టికెట్లు రద్దు చేసుకోవద్దని ఐఆర్సీటీసీ స్పష్టం చేసింది.
టిక్కెట్లను రద్దు చేసుకోకపోయినా ప్రయాణికులు తమ టికెట్లను ఏ ఖాతా నుంచి బుక్ చేసుకుంటే.. మళ్లీ అదే ఖాతాలోకి డబ్బు జమ అవుతుందని ప్రకటనలో తెలిపింది.
Also Read | ఇండియాలో కరోనా కేసులు @ 536