Anandaiah Medicine: ఆనందయ్య మందు తీసుకున్న వాళ్లు పొరపాటున కూడా దాన్ని తినకండి.

కరోనా కట్టడికి ఎన్నో టీకాలు ఉన్నా.. ఇప్పుడు అందరి దృష్టి ఆనందయ్య మందుమీదే పడింది. ఈ మందు తీసుకున్న తర్వాత తాము పూర్తిగా కరోనా నుంచి కోలుకున్నామని అనేక మంది చెప్పడంతో ఈ మందు కోసం చాలామంది ప్రయత్నించారు.

Anandaiah Medicine: ఆనందయ్య మందు తీసుకున్న వాళ్లు పొరపాటున కూడా దాన్ని తినకండి.

Anandaiah Medicine

Updated On : June 1, 2021 / 6:58 PM IST

Anandaiah Medicine: కరోనా కట్టడికి ఎన్నో టీకాలు ఉన్నా.. ఇప్పుడు అందరి దృష్టి ఆనందయ్య మందుమీదే పడింది. ఈ మందు తీసుకున్న తర్వాత తాము పూర్తిగా కరోనా నుంచి కోలుకున్నామని అనేక మంది చెప్పడంతో ఈ మందు కోసం చాలామంది ప్రయత్నించారు. ముందుకోసం నెల్లూరు జిల్లాలో ఉన్న కృష్ణపట్నం గ్రామానికి పయనమయ్యారు. ఇదే సమయంలో మందు పంపిణి నిలివేయడంతో కరోనా రోగులతోపాటు వారి కుటుంబ సభ్యులు నిరాశచెందారు.

ఆనందయ్యను పోలీసులు అదుపులోకి తీసుకోవడం మందు తయారీ అడ్డుకోవడం వంటివి ప్రజలను ఆగ్రహానికి గురిచేశాయి. ఇలా చేయడం పట్ల చాలామంది సోషల్ మీడియా ద్వారా అసహనం తెలిపారు. ఆనందయ్యకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అనేక నాటకీయ పరిణామాల అనంతరం ఆనందయ్య మందు పంపిణీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో మందు పంపిణీకి మార్గం సుగమమైంది. అయితే ఈ మందు ఆన్ లైన్ లో కూడా లభిస్తుండటం ఆనందించాల్సిన విషయం.. దీనికోసం ప్రత్యేకమైన మొబైల్ యాప్ రూపొందిస్తున్నట్లు నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు తెలిపారు.

ఇక మందు గురించిన విషయాలను ఆనందయ్య మీడియాకు తెలిపారు. దీని వలన ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవని వెల్లడించారు. ఇక ఈ మందు తీసుకున్న వారు వారం రోజుల వరకు మాంసం తీసుకోకూడదని తెలిపారు. మందు తీసుకున్న వారం రోజుల లోపు మాంసం తీసుకుంటే దుష్ప్రభావాలు వచ్చి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ఆనందయ్య వివరించారు. ఇది ఇప్పుడు ఇస్తున్న మందు కాదని గత 15 ఏళ్లుగా పాముకాటుకు, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కు ఇస్తున్నామని ఈ మందు ఇన్ఫెక్షలను నయం చేయడంలో బాగా పనిచేస్తుందని అన్నారు. కంట్లో వేసే మందు అడవిలో దొరికే మూలికలతో తయారుచేశామని.. దానివలన ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవని అన్నారు ఆనందయ్య.

ఇక ఈ మందును ఉచితంగానే ఇస్తున్నట్లుగా తెలిపారు.. స్పాన్సర్లు ముందుకు రావడంతో మందు ఉచిత పంపిణి సాధ్యమవుతుందని వివరించారు. మొదట తమ కుటుంబ ఈ మందు తయారు చేసినప్పుడు లక్ష రూపాయలు ఖర్చు అయ్యాయని.. తర్వాత గ్రామస్తుల సహకారంతో మందును ఇంతకాలం ఉచితంగా ఇచ్చామని వెల్లడించారు.