Dussehra Blasts Conspiracy : దసరా పేలుళ్ల కుట్ర కేసు.. ముగ్గురు లష్కరే తొయిబా ఉగ్రవాదులపై ఎన్ఐఏ చార్జిషీట్

దసరా పేలుళ్ల కుట్ర కేసులో ఎన్ఐఏ చార్జిషీట్ దాఖలు చేసింది. ముగ్గురు లష్కరే తొయిబా ఉగ్రవాదులపై చార్జిషీట్ దాఖలు చేసింది. ముగ్గురు లష్కరే తొయిబా ఉగ్రవాదుల పాత్రను ఎన్ఐఏ చార్జిషీట్ లో పేర్కొంది.

Dussehra Blasts Conspiracy : దసరా పేలుళ్ల కుట్ర కేసు.. ముగ్గురు లష్కరే తొయిబా ఉగ్రవాదులపై ఎన్ఐఏ చార్జిషీట్

NIA chargesheet

Updated On : March 30, 2023 / 12:37 AM IST

Dussehra Blasts Conspiracy : దసరా పేలుళ్ల కుట్ర కేసులో ఎన్ఐఏ చార్జిషీట్ దాఖలు చేసింది. ముగ్గురు లష్కరే తొయిబా ఉగ్రవాదులపై చార్జిషీట్ దాఖలు చేసింది. ముగ్గురు లష్కరే తొయిబా ఉగ్రవాదుల పాత్రను ఎన్ఐఏ చార్జిషీట్ లో పేర్కొంది. అబ్దుల్ వాజిద్, సీయుద్ధీన్, హసన్ ఫరూక్ పై చార్జీషట్ దాఖల్ చేసింది. ఈ ముగ్గురు ఉగ్ర కార్యకాలాపాల కోసం నిధుల సమీకరణకు కుట్ర పన్నారని ఎన్ ఐఏ ఆరోపిస్తోంది. అలాగే, పేలుడు పదార్థాల సమీకరణకు యత్నించారని అభియోగాలు మోపింది.

హైదరాబాద్ లో రద్దీ ప్రదేశాల్లో పేలుళ్లు జరపాలని కుట్ర పన్నారని చార్జిషీట్ లో ఎన్ఐఏ పేర్కొంది. నిందితులంతా ఫర్హతుల్లాకి టచ్ లో ఉన్నట్లు ఎన్ఐఏ తేల్చింది. రాష్ట్రంలో తీవ్ర సంచలనం రేపిన హైదరాబాద్ పేలుళ్ల కుట్ర కేసులో ఎన్ఐఏ చార్జిషీట్ దాఖలు చేశారు. ఇందులో ప్రస్తుతం అబ్దుల్ వాజిద్, సీయుద్ధీన్, హసన్ ఫరూక్ పై చార్జీషట్ దాఖలు చేసింది.

Jammu and Kashmir: జమ్మూ‌కశ్మీర్‌లో వరుస బాంబు పేలుళ్లు

గత సెప్టెంబర్28న ఈ ముగ్గురిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. గోరి మహ్మద్ ఆదేశాల మేరకు
దసరా పండుగ రోజున హైదరాబాద్ లో పెద్ద ఎత్తున పేలుళ్లకు ప్లాన్ చేసినట్లుగా సిట్ అధికారులు కొన్ని ఆధారాలు సేకరించారు. ఈ కేసును నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి బదిలీ చేశారు. ముగ్గురు నిందితులపై గతంలో ఐపీసీ 123తోపాటు 153కే, అదేవిధంగా పేలుడు పదార్ధాల చట్టం 485(6)తోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

నాలుగు హ్యాండ్ గ్రానైట్లను ఇతర దేశాల నుంచి హైదరాబాద్ కు చేరవేసినట్లు సిట్ అధికారులు గతంలో సేకరించారు. ఇక హవాలా రూపంలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్లు పోలీసులు కొన్ని ఎవిడెన్స్ సేకరించారు. పేలుడు పదార్థాలను షమీ, అసీన్ అనే ఇద్దరు వ్యక్తులు ఇక్కడికి తీసుకొచ్చినట్లు ఆధారాలున్నట్లు తెలుస్తోంది.