అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం 

  • Published By: chvmurthy ,Published On : April 19, 2019 / 02:54 AM IST
అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం 

Updated On : April 19, 2019 / 2:54 AM IST

పోర్టుబ్లెయిర్: అండమాన్ నికోబార్ దీవుల్లో శుక్రవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం ప్రభావం రిక్టర్ స్కేలుపై 5.1 గా నమోదైందని భారత వాతావరణశాఖ అధికారులు చెప్పారు. శుక్రవారం తెల్లవారుజామున గం. 3.27 నిమిషాలకు పదికిలోమీటర్ల లోతులో భూమి కంపించిందని అధికారులు చెప్పారు.
Also Read : TMC ప్రచారంలో బంగ్లా యాక్టర్స్: ఇండియా వదిలి పోమ్మంటు కేంద్రం ఆర్డర్స్

ఈ భూకంపం ప్రభావం వల్ల ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తినష్టం సంభవించలేదు. భూకంపం ప్రభావిత ప్రాంతమైన అండమాన్ నికోబార్ దీవుల్లో ఏప్రిల్ 1వతేదీనుంచి ఇప్పటివరకు భూమి 20 సార్లు కంపించిందని అధికారులు వివరించారు.