Land for Jobs Scam: రూ.150 కోట్ల ఇంటిని రూ.4 లక్షలకే తేజశ్వీ కొన్నాడు.. ఈడీ ఆరోపణలు
ఈ కేసుకు సంబంధించి శనివారం దేశంలోని 24 ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో పెద్ద మొత్తంలో అవినీతి బయటపడిందని ఈడీ పేర్కొంది. కోటి రూపాయల నగదు లభించగా.. సుమారు 600 కోట్ల రూపాయలకు సంబంధించిన వివరాలు వెల్లడైనట్లు పేర్కొంది. బిహార్ సహా దేశంలోని పలు ప్రదేశాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది

ED says Tejashwi Yadav’s Rs 150 crore Delhi home bought for Rs 4 lakh
Land for Jobs Scam: లాండ్ ఫర్ జాబ్స్ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్జేడీ నేత, బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజశ్వీ యాదవ్కు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తీవ్ర ఆరోపణలు చేసింది. ఢిల్లీలో ఉన్న తేజశ్వీ నివాసం విలువ 150 కోట్ల రూపాయలు ఉంటే దాన్ని తేజశ్వీ కేవలం 4 లక్షల రూపాయలకే కొన్నారని ఈడీ ఆరోపించింది. ఏబీ ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో రిజిస్టర్ చేయబడిన ఈ ఆస్తి, స్వతంత్ర నాలుగు అంతస్తుల బంగ్లా. తేజస్వి యాదవ్ సహా ఆయన కుటుంబ సభ్యులు యాజమాన్యంగా ఉందని ఏజెన్సీ తెలిపింది.
Drunk Groom: ఫుల్లుగా తాగేసి పెళ్లి పీటల మీదే పడుకున్న వరుడు.. తర్వాత ఏం జరిగిందంటే?
కాగా, ఈ కేసుకు సంబంధించి శనివారం దేశంలోని 24 ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో పెద్ద మొత్తంలో అవినీతి బయటపడిందని ఈడీ పేర్కొంది. కోటి రూపాయల నగదు లభించగా.. సుమారు 600 కోట్ల రూపాయలకు సంబంధించిన వివరాలు వెల్లడైనట్లు పేర్కొంది. బిహార్ సహా దేశంలోని పలు ప్రదేశాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. దక్షిణ ఢిల్లీలోని లాలూ ఇంటితో పాటు ఆయన కుమార్తె రాగిణి యాదవ్, చంద యాదవ్, హేమా యాదవ్, ఆర్జేడీ ఎమ్మెల్యే సయ్యద్ అబు దోజానా, అమిత్ కత్యాల్, నవదీప్ సర్దానా, ప్రవీణ్ జైన్ ఇళ్లలో సోదాలు జరిగాయి.
MLC Kavitha: ముగిసిన ఈడీ విచారణ.. 8 గంటలపాటు కవితను ప్రశ్నించిన అధికారులు
ఢిల్లీ, పాట్నా, రాంచీ, ముంబై ప్రాంతాల్లో సోదాలు ప్రముఖంగా నిర్వహించారు. ఇక శుక్రవారం నిర్వహించిన సోదాల్లో 70 లక్షల రూపాయల నగదు, 1.5 కిలోల బంగారం నగలు, 540 గ్రాముల బంగారు వస్తువులు, 900 అమెరికా డాలర్లు లభించాయట. ఇవన్నీ లెక్కలో లేనట్లు ఈడీ పేర్కొంది. కాగా ఇదే కేసుకు సంబంధించి లాలూ కుమారుడు తేజశ్వీ యాదవ్కు సీబీఐ సమన్లు పంపింది. శనివారం తమ ముందు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ తేజశ్వీ భార్య ఆసుపత్రిలో ఉండడం వల్ల హాజరు కాలేదు.
MLC Kavitha : మళ్లీ రండి.. మార్చి 16న మరోసారి కవితను విచారించనున్న ఈడీ..!
లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి అతని సహచరులకు తక్కువ ధరలకు భూములు విక్రయించినందుకు బదులుగా రైల్వేలో ఉద్యోగాలు ఇచ్చినట్లు తీవ్ర ఆరోపణలు వచ్చాయి. నేరపూరిత కుట్ర, అవినీతి నిరోధక చట్టంలోని నిబంధనల కింద లాలూ యాదవ్, ఆయన భార్య రబ్రీ దేవితో పాటు మరో 14 మందిపై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. నిందితులందరికీ మార్చి 15న సమన్లు జారీ చేయనున్నారు. 2004-2009 మధ్య కాలంలో లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా పని చేశారు. ఆ సమయంలో లాలూ కుటుంభ సభ్యులకు భూములు, ఆస్తులు తక్కువ ధరకు బదిలీ చేశారట. అందుకు గాను రైల్వేలో ఆయన ఉద్యోగాలు ఇప్పించినట్లు సీబీఐ ఆరోపిస్తోంది. సీబీఐ ఫిర్యాదు ఆధారంగా మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని క్రిమినల్ సెక్షన్ల కింద ఈడీ కేసు నమోదు చేసింది.