పొంగల్ వేడుకల్లో వృధ్ధ మహిళ డ్యాన్స్ కు నెటిజన్లు ఫిదా

  • Published By: chvmurthy ,Published On : January 15, 2020 / 02:03 PM IST
పొంగల్ వేడుకల్లో వృధ్ధ మహిళ డ్యాన్స్ కు నెటిజన్లు ఫిదా

Updated On : January 15, 2020 / 2:03 PM IST

పొంగల్ వేడుకలను పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ వినూత్నంగా జరుపుకున్నారు. జనవరి 14 న  పుదుచ్చేరి మున్సిపాలిటీలో పని చేసే మహిళా కార్మికులను రాజ్ భవన్ కు పిలిచి వారందరితో సరదాగా గడిపారు. వారిలో ఒక వయస్సు మళ్ళిన మహిళ పాటలకు డ్యాన్స్ చేసి అందరినీ అలరించింది. మహిళందరూ పింక్ చొక్కా ధరించి, స్వఛ్చ భారత్, స్వఛ్చ కార్పోరేషన్ అనే స్లోగన్ రాసిన యూనిఫాం ధరించి ఈ కార్యక్రమానికి హజరయ్యారు. 

 వృధ్ధ మహిళ చేసిన డ్యాన్స్ ను కిరణ్ బేడీ ట్విట్టర్ లో పోస్టు చేశారు. ఈవీడియో ఇప్పుడు అందరి హృదయాలను దోచుకుంది. ప్రతి ఒక్కరు ఆమె డ్యాన్స్ ను పొగుడుతున్నారు. వేలాది మంది నెటిజన్లు మహిళ చేసిన డ్యాన్స్ ను లైక్ చేశారు. ఆ మహిళ చేసిన డ్యాన్స్ ను పొగిడారు. కిరణ్ బేడీ వారితో ఆనందంగా గడుపూతూ.. వారితో పాటలు పాడుతూ… వారిని నవ్విస్తూ ఉన్న ఫోటోలను, ట్విట్టర్ లో పోస్టు చేశారు. ఆమె తీసుకున్ననిర్ణయాన్ని అందరూ అభినందిస్తున్నారు. 

 

మున్సిపాలిటీలో పని చేసే మహిళలను అభినందించటానికి, వారితో సరదాగా గడపటానికి ఒక వేదిక ఏర్పాటు చేసిన కిరణ్ బేడీని ప్రశంసిస్తూనే పండుగ పూట ఇలాంటి వీడియో చూడటం చాలా సంతోషాన్ని కలిగించిందన్నారు నెటిజన్లు.  వారిలో ఉన్న కళను వ్యక్తీకరించటానికి ఈ వేదిక బాగా ఉపయోగ పడిందని కామెంట్లు చేశారు. 

 ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్, స్వఛ్చ కార్పోరేషన్ కు చెందిన సుమారు 1500 మంది మహిళలు పాల్గోనగా వారందరికీ గవర్నర్ ఒక టవల్, చీర బహుకరించారు. వారితో గడిపిన ఆనంద సమయంలో తీసిన ఫోటోలను కిరణ్  బేడీ ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు.  ఆ ఫోటోలకు నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్  వచ్చింది.