ఖబడ్దార్.. బైకర్లు ఫుట్‌పాత్ ఎక్కారా.. పెద్దావిడ చేతిలో చుక్కలే

  • Published By: madhu ,Published On : February 22, 2020 / 03:19 PM IST
ఖబడ్దార్.. బైకర్లు ఫుట్‌పాత్ ఎక్కారా.. పెద్దావిడ చేతిలో చుక్కలే

Updated On : February 22, 2020 / 3:19 PM IST

ఓ పెద్దావిడను చూస్తే..బైకర్స్‌కు హఢల్. ఆమె అక్కడ నిలబడ్డారంటే..చాలు..బైకర్స్ మెల్లిగా..పక్కనుంచి వెళుతుంటారు. అంటే ఆమే ఏం చేస్తుంది ? భయపెడుతుందా ? అంటే అది కాదు. కేవలం నిబంధనలు పాటించాలంటూ…ఆర్డర్ వేస్తుంది. అంతే..ఫుట్ పాత్ ఉన్నది పాదాచారుల కోసం..బైకర్స్‌కు కాదు..అంటూ…సూచనలిస్తుంది..అంతేకాదు..వారిని అసలు ముందుకు పోనియ్యదు. దీనికి సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీనిపై స్పందించిన ట్రాఫిక్ పోలీసు విభాగం తగిన చర్యలు తీసుకుంటామని చెబుతోంది. 

ఏ నగరంలో చూసినా..ఉదయం నుంచి రాత్ర పొద్దు పోయే వరకు..లక్షలాది వాహనాలు రయ్యి రయ్యి మంటూ దూసుకెళుతుంటాయి. తొందరగా వెళ్లాలని కొందరు..నిబంధనలు సైతం పక్కకు పెడుతుంటారు. పాదాచారుల కోసం ఏర్పాటు చేసిన ఫుట్ పాత్‌లపై కూడా ప్రయాణిస్తూ..తోటి వారిని ఇబ్బందులకు గురి చేస్తుంటారు. దీంతో బాటసారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. పూణే నగరంలో ఇలాగే జరిగింది. దీంతో ఓ పెద్దావిడ..జరుగుతున్న ఇబ్బందులు చూసింది. వెంటనే రంగంలోకి దిగింది. చేతులు వెనక్క పెట్టుకుని..ఫుట్ పాత్‌లపై వస్తున్న బైకర్స్‌ని ఆపింది. క్లాస్ పీకారు. దీంతో భయపడిన బైకర్లు ఫుట్‌పాత్‌పై నుంచి వచ్చేందుకు వెనకడుగు వేస్తున్నారు. 

Read More : మోడీ బహుముఖ మేధావి : సుప్రీంకోర్టు జడ్జీ ప్రశంసలు

ఈమెకు మరో ఇద్దరు జత కలిశారు. ముగ్గురు కలిసి ఫుట్ పాత్‌పై నుంచి వాహనాలు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ వీడియోను అమిత్ రూకే అనే జర్నలిస్టు ట్విట్టర్‌లో షేర్ చేశారు. నిమిషాల్లోనే వైరల్ అయిపోయింది. పెద్దావిడ చేస్తున్న పనికి ప్రశంసలు కురిపిస్తున్నారు. పూణే పోలీసులకు కర్తవ్యం గుర్తుకు తెచ్చారని అంటుంటే..మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఫుట్ పాత్‌పై బైక్ నడిపే వారు సిగ్గు పడాలి అంటూ చెబుతున్నారు. మరికొందరు..పెద్దావిడ..మా నగరానికి వస్తే..బాగుండూ..సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.