Hockey Symbol : అమరీందర్‌ పార్టీకి హాకీ సింబల్‌

కెప్టెన్ అమరీందర్ సింగ్ సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. కాంగ్రెస్‌ అదిష్టానం ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించింది. దీంతో కాంగ్రెస్‌ను వీడిన ఆయన కొత్త పార్టీ పెట్టాడు.

Hockey Symbol : అమరీందర్‌ పార్టీకి హాకీ సింబల్‌

Hockey

Updated On : January 11, 2022 / 10:12 AM IST

Punjab Lok Congress party : పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రారంభించిన పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల కమిషన్ సింబల్ కేటాయించింది. హాకీ స్టిక్, బాల్ తమకు కేటాయించారని అమరీందర్ వెల్లడించారు. పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ బీజేపీతో ఎన్నికల పొత్తు కుదుర్చుకుంది. పంజాబ్‌లో ఫిబ్రవరి 14న ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి.

పంజాబ్ అసెంబ్లీకి 117 స్థానాలున్నాయి. కెప్టెన్ అమరీందర్ సింగ్ సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. ఇటీవల జరిగిన పరిణామాల్లో కాంగ్రెస్ పార్టీ మరో నేత నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూకు ప్రాధాన్యత పెంచి అమరీందర్‌కు ప్రాధాన్యత తగ్గించింది.

Tragedy : ఈతకెళ్లి మున్నేరు వాగులో ఐదుగురు విద్యార్థులు గల్లంతు.. నలుగురి మృతదేహాలు వెలికితీత

అంతేకాకుండా కాంగ్రెస్‌ అదిష్టానం అమరీందర్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించింది. దీంతో కాంగ్రెస్‌ను వీడిన ఆయన కొత్త పార్టీ పెట్టాడు. అమరీందర్‌ సొంతంగా పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో అమరీందర్ పార్టీకి హాకీ స్టిక్, బాల్ సింబల్ ను ఈసీ కేటాయించింది.