Elephant Eating Panipuri: పానీపూరిని తెగ లాగించేసిన ఏనుగు.. వీడియో వైరల్.. ఫిదా అవుతున్న నెటిజన్లు
అసోంలోని తేజ్పుర్లో ఓ ఏనుగు ఎంతో బుద్ధిగా పానీపూరి లాగించేసింది. మావటి వాడు ఏనుగును పానీపూరి బండి వద్దకు తీసుకువచ్చాడు. దీంతో ఏనుగు ఆ బండివాడు ఇచ్చిన ఒక్కో పానీపూరిని తొండంతో తీసుకొని తినేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Elephant Eating Panipuri
Elephant Eating Panipuri: పానీపూరి అంటే చాలా మంది ఇష్టంగా తింటారు. సాయంత్రం అయితే చాలు పానీపూరి బండి వద్ద సందడిగా ఉండటాన్ని మనం చూస్తుంటాం. అంతలా పానీపూరీని కొందరు ఇష్టంగా తింటుంటారు. అయితే, మనుషుల వలే ఏనుగులు కూడా పానీపూరి తింటాయని మీకు తెలుసా? ఏనుగులన్నీ కాదు.. ఓ ఎనుగు పానీపూరి బండి వద్దకు వెళ్లి వాటిని తెగ తినేసింది. ఈ ఘటన చూసిన స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అసోంలోని తేజ్పుర్లో ఓ ఏనుగు ఎంతో బుద్ధిగా పానీపూరి లాగించేసింది. మావటి వాడు ఏనుగును పానీపూరి బండి వద్దకు తీసుకువచ్చాడు. దీంతో ఏనుగు ఆ బండివాడు ఇచ్చిన ఒక్కో పానీపూరిని తొండంతో తీసుకొని తినేసింది. ఏనుగు పానీపూరి తినడం చూసి స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
#viralvideo elephant eating a #Panipuri pic.twitter.com/OJ4Yp7tY40
— Siraj Noorani (@sirajnoorani) October 11, 2022
ఏనుగు పానీపూరి తినే వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కొందరు నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ఓ నెటిజన్.. ఇక పానీపూరి ప్రియులకు సరైన జోడీ దొరికింది.. అంటూ పేర్కొన్నాడు. మరో నెటిజన్.. పానీపూరి ప్రియులు ఇకనుంచి పానీపూరి ఎక్కడ దొరుకుతుందా అని ఎతుకోవాల్సిందే అంటూ సెటైరికల్ గా కామెంట్ చేశాడు.