Elephant In Children Park: పిల్లల పార్కులో ఏనుగు సందడి.. టైర్లతో ఫుట్‌బాల్ ఎలా ఆడిందో చూడండి.. వీడియో వైరల్

ఓ ఏనుగు అటవీ ప్రాంతం నుంచి పిల్లలు ఆడుకొనే పార్కులోకి వచ్చింది. పార్కులోని టైర్లతో ఆడుకుంటూ సందడి చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పార్క్ గౌహతిలోని నరేంగి ఆర్మీ కంటోన్మెంట్ లోపల ఉంది.

Elephant In Children Park: పిల్లల పార్కులో ఏనుగు సందడి.. టైర్లతో ఫుట్‌బాల్ ఎలా ఆడిందో చూడండి.. వీడియో వైరల్

Elephant In Children Park

Updated On : October 17, 2022 / 9:16 PM IST

Elephant In Children Park: ఏనుగులు అటవీ ప్రాంతాల్లో నుంచి జనావాసాల్లోకి వచ్చి ఒక్కోసారి బీభత్సం సృష్టిస్తాయి. మరికొన్ని సమయాల్లో చిలిపి పనులతో నవ్వులు తెప్పిస్తాయి. తాజాగా ఓ ఏనుగు అటవీ ప్రాంతం నుంచి పిల్లలు ఆడుకొనే పార్కులోకి వచ్చింది. పార్కులోని టైర్లతో ఆడుకుంటూ సందడి చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను 30వేల మంది వీక్షించారు. ఈ పార్క్ గౌహతిలోని నరేంగి ఆర్మీ కంటోన్మెంట్ లోపల ఉంది.

Viral Video: కాలేజ్ క్యాంటీన్‌లో గొడవపడ్డ ఇద్దరు అమ్మాయిలు.. వైరల్‌గా మారిన వీడియో

30 సెకన్ల నిడివి గల వీడియోలో ఏనుగు చిన్నపిల్లల ఊయలతో మెల్లగా ఆడుతున్నట్లు చూడొచ్చు. టైర్లు స్వింగ్‌ అవుతుంటే ముందుకు వెనుకకు ఏనుగు నడుస్తుంది. ట్రైర్లతో ఏర్పాటు చేసిన ఉయ్యాలను ఫుట్‍‌బాల్ ప్లేయర్ బాల్‌ను తన్నినట్లు ముందుకెళ్లి వెనుకకాలుతో తంతూ ఏనుగు కొద్దిసేపు సందడి చేసింది.

ఆ సమయంలో పార్కులో పిల్లలు ఎవరూ లేరు. అయితే, ఆహారం కోసం ఏనుగు సమీపంలోని అమ్‌చాంగ్ వన్యప్రాణుల అభయారణ్యం నుండి కంటోన్మెంట్‌లోకి వచ్చి ఉండవచ్చని స్థానికులు తెలిపారు.