Pulwama Encounter : పుల్వామాలో ఎన్‌కౌంటర్…ఇద్దరు ఉగ్రవాదుల హతం

జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఆదివారం రాత్రి భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. లారో-పరిగం ప్రాంతంలో ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. పుల్వామాలోని లారో-పరిగం ప్రాంతంలో ఎన్‌కౌంటర్ ప్రారంభమైందని కశ్మీర్ జోన్ పోలీసులు ట్వీట్ చేశారు....

Pulwama Encounter : పుల్వామాలో ఎన్‌కౌంటర్…ఇద్దరు ఉగ్రవాదుల హతం

Pulwama Encounter

Pulwama Encounter : జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఆదివారం రాత్రి భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. లారో-పరిగం ప్రాంతంలో ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. పుల్వామాలోని లారో-పరిగం ప్రాంతంలో ఎన్‌కౌంటర్ ప్రారంభమైందని కశ్మీర్ జోన్ పోలీసులు ట్వీట్ చేశారు. పుల్వామా ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం అయ్యారు. లష్కరే తోయిబాకు చెందిన టాప్ కమాండర్ ను భద్రతా దళాలు మట్టుబెట్టాయి.  రాజౌరీ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాది హతమైన రెండు వారాల తర్వాత ఎదురుకాల్పులు జరిగాయి. (Encounter breaks out between security forces)

Onion : నేటి నుంచి ఢిల్లీలో సబ్సిడీపై ఉల్లి విక్రయం

ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్ ఆధారంగా ఆర్మీకి చెందిన రాష్ట్రీయ రైఫిల్స్, జమ్మూకశ్మీర్ పోలీసుల సంయుక్త ఆపరేషన్ ప్రారంభించారు. (Pulwama Encounter) జమ్మూ కాశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఆర్మీ జవాన్లు మరణించారు. దక్షిణ కాశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలోని హలాన్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయని పోలీసు అధికారి తెలిపారు.

Tirupati : తీవ్ర విషాదం.. అడవిలో చెట్టుకు ఉరి వేసుకుని ప్రేమజంట ఆత్మహత్య, పెళ్లి చేసుకుని ఆ తర్వాత

భద్రతా దళాలపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో సెర్చ్ ఆపరేషన్ ఎన్‌కౌంటర్‌గా మారిందని పోలీసులు తెలిపారు. గతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. చికిత్స పొందుతూ ముగ్గురు ఆర్మీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. జమ్మూకశ్మీరులోని పలు ప్రాంతాల్లో ఇటీవల ఉగ్రవాదుల కదలికలు పెరగడంతో భద్రతా బలగాలు గాలింపును విస్తృతం చేశాయి. దీంతో కశ్మీరులో తరచూ ఎదురుకాల్పుల ఘటనలు జరుగుతున్నాయి.