Encounter In Chhattisgarh : ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు, ఇద్దరు మావోయిస్టులు మృతి

కూంబింగ్‌ కొనసాగుతున్నట్లు వివరించారు ఎస్పీ. ఇక శుక్రవారం కూడా ఎన్‌కౌంటర్‌ జరిగింది. బస్తర్ జిల్లాలో జరిగిన ఈ ఎదురు కాల్పుల్లో ఓ మహిళ మావోయిస్టు మృతి చెందినట్లుగా పోలీసులు తెలిపారు.

Encounter In Chhattisgarh : ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు, ఇద్దరు మావోయిస్టులు మృతి

Encounter In Chhattisgarh

Updated On : June 20, 2021 / 11:43 AM IST

Encounter In Chhattisgarh : పోలీసులకు మావోయిస్టులకు మధ్య వరస  ఎన్‌కౌంటర్‌లు జరుగుతున్నాయి. తాజాగా విశాఖ జిల్లాలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎన్‌కౌంటర్‌ జరగ్గా ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఇదిలా ఉంటే శనివారం ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్‌ జిల్లా అటవీ పరిధిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారు.

ఓర్చా పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డ్‌ కూంబింగ్‌ నిర్వహిస్తుండగా నక్సల్స్‌ తారసపడటంతో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు ఘటన స్థలిలోనే చనిపోయినట్లు నారాయణపూర్ ఎస్పీ మోహిత్ గార్గ్‌ తెలిపారు. మృతి చెందిన మావోయిస్టుల వివరాలు ఇంకా తెలియరాలేదని ఆయన వివరించారు. మరికొందరు పారిపోయినట్లు తెలిపారు.

కూంబింగ్‌ కొనసాగుతున్నట్లు వివరించారు ఎస్పీ. ఇక శుక్రవారం కూడా ఎన్‌కౌంటర్‌ జరిగింది. బస్తర్ జిల్లాలో జరిగిన ఈ ఎదురు కాల్పుల్లో ఓ మహిళ మావోయిస్టు మృతి చెందినట్లుగా పోలీసులు తెలిపారు. ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రదేశంలో 3 ఏకే 47 రైఫిళ్లు, పేలుడు పదార్దాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు