Engineers Day : ఇంజనీర్ల దినోత్సవం సందర్భంగా దశరథ్ మాంఝీ ఫోటో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా .. ఎవరీ మాంఝీ..?

మనిషి సంకల్పించుకుంటే అసాధ్యం ఏదీ లేదని ఓ నిరుపేద నిరూపించాడు.అతని కృషి, పట్టుదల, సంకల్పబలం ఎన్నో గ్రామాలకు మార్గాన్ని ఏర్పరచింది. అక్షర జ్ఞానం లేకపోయినా ఓ గొప్ప ఇంజనీర్ అంటూ ప్రశంసలు పొందేలా చేసింది.

Engineers Day : ఇంజనీర్ల దినోత్సవం సందర్భంగా దశరథ్ మాంఝీ ఫోటో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా .. ఎవరీ మాంఝీ..?

Dashrath Manjhi..Anand Mahindra

Updated On : September 15, 2023 / 5:39 PM IST

Dashrath Manjhi..Anand Mahindra Engineers Day: సెప్టెంబర్ 15. ఇంజరీర్ల దినోత్సవం(Engineers Day). ఈ ఇంజనీర్ల దినోత్సవం సందర్భంగా ఆసక్తిక ఫోటోలను..వీడియోలను షేర్ చేసే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) ట్విట్టర్ దశరథ్ మాంఝీ (Dashrath Manjhi)ఫోటోను షేర్ చేశారు. మౌంటెన్ మ్యాన్ గా పేరొందిన దశరథ్ మాంఝీ ఫోటోను షేర్ చేశారు. ఎవరీ దశరథ్ మాంఝీ..?ఆయనకు ఎందుకు మౌంటెన్ మ్యాన్ ( Mountain Man of India Dashrath Manjhi) గా పేరు వచ్చిందో తెలుసుకుందాం..

ధశరథ్ మాంఝీ. బీహార్ (Bihar) లోని గయ (gaya)జిల్లాకు చెందిన గెహ్లోర్ గ్రామానికి చెందిన ఓ సామాన్య వ్యక్తి. పేద కుటుంబంలో పుట్టాడు. చదువుకోలేదు. కంప్యూటర్ పరిజ్ఞానం లేదు. ఇంగ్లీస్ అంటే ఏంటో కూడా తెలియదు. కానీ ఓ పర్వతాన్ని పిండి చేశాడు. కొండను తొలిచి మార్గాన్ని నిర్మించాడు. అతని శ్రమకు ఫలితంగా ఏర్పాడిన దారిని ఇప్పుడు ఎంతోమందికి ఎంతో ఉపయోగకరంగా ఉంది. ఇతని శ్రమ, పట్టుదల,మేథో శక్తి ఉందే ఏదైనా దిగుదుడుపే అంటూ ఆనంద్ మహీంద్రా ప్రశంసించారు. ఇతనికి నమస్కరించండీ..ఇతనే ఇంజనీరు కాదు. ఏ ఇన్సిస్టిట్యూట్ లోను చదవలేదు. కంప్యూటర్ అంటే ఏంటో తెలియదు. అసరాస్యుడు. కానీ ఓ ఇంజనీర్ కూడా చేయని అద్భుతం చేశాడు అంటూ ప్రశంసించారు.మనిషి తలచుకుంటే అసాధ్యమనేది లేదని నిరూపించారంటూ ప్రశంసలతో ముంచెత్తారు. ఈ ట్వీట్ కు నెటిజన్లు స్పందిస్తు..గత జన్మలో అతను ఓ ఇంజనీర్ అయి ఉంటాడు అంటూ ఓ యూజర్ పేర్కొన్నాడు.

Social Media : పదేళ్ల వయస్సులో తప్పిపోయిన బాలికను 20 ఏళ్ల తరువాత ఇంటికి చేర్చిన సోషల్ మీడియా

మౌంటెన్ మ్యాన్ మాంఝీ..?
1934లో బీహార్ రాష్ట్రంలోని గెహ్లోర్ గ్రామంలో నిరుపేద కుటుంబంలో జన్మించిన దశరథ్ మాంఝీ దేశంలోనే మౌంటెన్ మ్యాన్ గా పేరొందాడు. పాట్నాకు దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉండే గెహ్లోర్ గ్రామానికి బయట ప్రపంచానికి మధ్య ఒక పేద్ద కొండ అడ్డంగా ఉండేది. బయటి ప్రపంచంలోకి రావాలంటే దాదాపు 75 కిలోమీటర్ల చుట్టుకొలత ఉండే ఆ కొండ చుట్టుకుని రావాలి. నిత్యవసరాలు కొనుక్కోవాలన్నా..ఆస్పత్రికి వెళ్లాలన్నా..చిన్న చిన్న పనుల కోసం బయటకు రావాలన్నా 32 కిలోమీటర్లు చుట్టుతిరిగి రావాల్సిందే. వేరే దారి లేక అలాగే వెళ్లి వచ్చేవారు గ్రామస్తులంతా. లేదా కొండ ఎక్కి దిగి వచ్చేవారు.

కానీ మాంఝీ మాత్రం ఆకొండను చూసినప్పుడల్లా దీనికో దారి ఉంటే బాగుండు అనుకునేవాడు. పేదవాడు. చిన్నప్పటినుంచే కూలిపనులకు వెళ్లేవాడు. ధనబాద్ లో బొగ్గు గనుల్లో పని చేసేవాడు. ఇతడికి ఫల్గుణి దేవి అనే అమ్మాయితో వివాహం జరిగింది. ఓ భూస్వామి వద్ద పనిచేసే తన భర్తకు ఫల్గుని రోజు మధ్యాహ్నం భోజనం తెచ్చేది. కొండ చుట్టి రావటం వెళ్లటం కష్టంగా ఉండటంతో ఆమె కొండ ఎక్కి దిగి భోజనం తెచ్చేది. కొన్ని గంటల సమయంలో కొండ ఎక్కి దిగాల్సి ఉండేది. అయినా ఆమె భర్త కోసం భోజనం తెస్తుండేది. అలా ఓ రోజు మాంఝీ భార్య భోజనం తెస్తుండగా కొండమీద కాలు జారి పడిపోయింది. ఆమెకు గాయాలయ్యాయి. కానీ అప్పటికే ఆకలితో ఉన్న మాంఝీ ఇంకా భోజనం రాలేదనే కోపంతో ఉన్నాడు. కోపంతో రగిలిపోయాడు. భార్య రాగానే కొట్టాలన్నంత కోపంగా ఉన్నాడు. ఎందుకంటే ఆకలితో ఉన్న మనిషి విచక్షణ కోల్పోతాడు. దొంగతనాలకు కూడా పాల్పడే పరిస్థితులకు నెట్టబడతాడు.

Minister KTR : డాక్టర్ కావటం అంత ఈజీ కాదు,నాకు ర్యాంక్ వచ్చినా ఎంబీబీఎస్ సీటు రాలేదు : కేటీఆర్

కొండను పిండి చేసిన ఒక సామాన్యుడు..
అలా గాయాలతోనే భోజనం తెచ్చిన భార్య పరిస్థితి చూసి చలించిపోయాడు. ఆ కొండను తవ్వి మార్గం వేయాలనుకున్నాడు. ఎంతోమందికి ఇబ్బందులు తప్పించాలనుకున్నాడు. కానీ పేదవాడు.చేతిలో ఎటువంటి యంత్రాలులేవు. అయినా సంకల్ప బలం ఉంది. తనకు తన కూలిపని..తనకు చిన్నపాటి ఆధారంగా ఉన్న కొన్ని గొర్రెల్ని అమ్మేసి ఆ డబ్బులతో గునపం,పార, ఉలి వంటి తవ్వకానికి కావాల్సిన పనిముట్లు కొన్నాడు.

వాటితో కొండపైకి ఎక్కి తవ్వడం ప్రారంభించాడు. అలా అంత పెద్ద కొండను తవ్వుతున్న మాంఝీని చూసి గ్రామస్తులంతా నవ్వేవారు. ‘ఏంటీ నువ్వొక్కడివే ఇంత పెద్ద తవ్వేస్తావా..?’’అంటే గేలి చేసేవారు. మొదట్లో బాధపడ్డా తన పనిమాత్రం మానలేదు మాంఝీ. రోజు కొండ తవ్వటానికే వెళ్లే వాడు. దీంతో ఏ పనులకు వెళ్లకపోవటంతో వచ్చే కొద్దిపాటి ఆదాయం పోయింది. ఇల్లు గడవటమే కష్టమైంది. దీంతో మాంఝీ భార్య పస్తుండేది. దీంతో అనారోగ్యానికి గురైంది. ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు చేతిలో డబ్బులు లేవు..పైగా కొండ దాటి వెళ్లాలి. లేదా కొండ చుట్టి వెళ్లాలి. దీంతో సరైన సమయంలో భార్యను ఆసుపత్రికి తీసుకెళ్లలేకపోయాడు. అలా అనారోగ్యంతోనే మాంఝీ భార్య చనిపోయింది.భార్య మరణంతో మాంజీ విలవిల్లాడిపోయాడు. కానీ మరింత పట్టుదలగా కొండ తవ్వటం ప్రారంభించాడు.

మౌంటెన్ మ్యాన్ ఆఫ్ ఇండియా గా పేరొందిన పేదవాడు..
అలా 10 ఏళ్లపాటు తవ్వి తవ్వి కొండను చీల్చాడు. చిన్నపాటి దారిని ఏర్పరిచాడు. అతడి శ్రమను గుర్తించిన కొంతమంది ఆ చీలిక నుంచి రోడ్డు వేసేందుకు ముందుకు వచ్చారు. 1982లో ఆ మార్గానికి సుగమం అయింది. అంటే ఈ మార్గాన్ని సృష్టించేందుకు 10 ఏళ్ల పాటు మాంఝీ కృషి చేశాడు. ఒక నిరుపేద కూలి ఒక పర్వతాన్ని జయించాడు. 360 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పు ఉన్న తను పిప్పి చేశాడు. అతడి కృషి ఫలితంగా సుమారు 60 గ్రామాల ప్రజలకు పాట్నా దగ్గర అయింది. ఇతడు కొండను తొలవడంతో మౌంటెన్ మ్యాన్ ఆఫ్ ఇండియా గా పేరొందాడు. ఇతడి ఘనత ఇంజనీర్ల దినోత్సవం రోజున ఆనంద్ మహీంద్రా.. ఈ తరం ఇంజనీర్లకు పరిచయం చేశారు. ఆనంద్ మహీంద్రా చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇంజనీర్ల దినోత్సవం రోజు అద్భుతమైన ఇంజనీర్ ను మాకు పరిచయం చేశారంటూ వారు కొనియాడుతున్నారు.

దశరథ మాంఝీ 2007లో 70 ఏళ్ల వయసులో మరణించాడు. కానీ ఈనాటికి ఎంతోమందికి ఆదర్శంగా ఉన్నాడు. పర్వతాన్ని చీల్చిన పనివాడు. పర్వతాన్ని పిండిచేసిన సంకల్పబలం అంటూ ప్రశంసలు అందుకున్నాడు. చనిపోయినా అతని పేరు నిలిచిపోయింది.