Social Media : పదేళ్ల వయస్సులో తప్పిపోయిన బాలికను 20 ఏళ్ల తరువాత ఇంటికి చేర్చిన సోషల్ మీడియా

10 ఏళ్ల వయస్సులో తప్పిపోయిన బాలిక సోషల్ మీడియా పుణ్యమాని 20 ఏళ్ల తరువాత కుటుంబాన్ని కలుసుకుంది.

Social Media : పదేళ్ల వయస్సులో తప్పిపోయిన బాలికను 20 ఏళ్ల తరువాత ఇంటికి చేర్చిన సోషల్ మీడియా

social media

Updated On : September 15, 2023 / 4:15 PM IST

tamil nadu Social media : సోషల్ మీడియా వేదికగా ఎన్నో విషయాలు, సమాచారాలు ఇట్టే జనాలకు తెలిసిపోతున్నాయి. ఎంతో మందిలో ఉండే టాలెంట్ ను వారికి వారే బయటపెట్టుకునే సాధనంగా సోషల్ మీడియా ఉపయోగపడుతోంది. అటువంటి సోషల్ మీడియా దూరమైన బంధువుల్ని, ఆత్మీయుల్ని కూడా దగ్గర చేస్తోంది. ఒకటి చేస్తోంది. పదేళ్ల వయస్సులో తప్పిపోయిన బాలికను 20 ఏళ్ల తరువాత ఇంటికి చేర్చిన సోషల్ మీడియా. తిరునాళ్లకు వెళ్లినప్పుడు చిన్నప్పుడు కుటుంబంలో హీరోనో లేదా హీరోయిన్ తప్పిపోయిందని తిరిగి పెద్దయ్యాక కుటుంబాన్ని కలిసిందని సినిమాల్లో చూస్తుంటాం. అలా వారి గుర్తుగా ఏదో ఓ లాకెట్లో..లేదా పుట్టుమచ్చో..లేదా పచ్చబొట్టో చూసి చిన్నప్పుడు తప్పిపోయినవారే అని గుర్తించటం వంటివి సినిమాల్లో చూశాం. కానీ అటువంటి సంఘటన నిజంగానే సోషల్ మీడియావల్ల జరిగింది.

తమిళనాడులో ఓ బాలిక ఎప్పుడో 20 ఏళ్ల క్రితం తప్పిపోయింది. తప్పిపోయే సమయానికి బాలిక వయస్సు 10 ఏళ్లు. ఆ బాలిక సోషల్ మీడియా పుణ్యమాని..20 ఏళ్ల తరువాత కుటుంబాన్ని కలిసింది. దీంతో ఆ కుటుంబం ఆనందం అంతా ఇంతా కాదు. ధర్మపురి జిల్లా పెన్నాగరం సమీపంలోని కెండయనళ్లి పుదూర్‌కు చెందిన వెంకటాచలం, మాతమ్మాల్‌ దంపతులకు రమ్య అనే పాప ఉండేది. ఆమె బదిరురాలు. పాపను బధిరుల ఓ ప్రైవేటు స్కూల్లో చేర్చారు.

2002లో ఆ స్కూల్ పిల్లల్ని రైల్లో టూర్‌కు వెళ్లింది. ఆ టూర్‌లో రమ్య తప్పిపోయింది. అదే విషయాన్ని స్కూల్ వాళ్లు ఆమె కుటంబానికి చెప్పారు. అప్పటినుంచి తల్లిదండ్రులు, బంధువులు రమ్య కోసం చాలా వెదికారు. కానీ దొరకలేదు. ఈ క్రమంలో ధర్మపురి జిల్లాకు చెందిన బధిరురాలు ముంబైలో ఉందని చెన్నైలోని బధిరుల సంస్థకు ఓ మహిళ ఫొటో పంపింది. ఆ ఫొటోను బధిరుల సంస్థ రాష్ట్రవ్యాప్తంగా పలు సోషల్‌ మీడియా గ్రూప్‌లలో షేర్ చేసింది.

అలా ఆ ఫోటో తిరిగి తిరిగి రమ్య తల్లిదండ్రుల దృష్టికి వచ్చింది. ఆమె తమ కూతురే అయి ఉండచ్చనుకున్నారు. అదే ఆశతో సదరు సంస్థను సంప్రదించారు. అక్కడికి వెళ్లిన తర్వాత ఆమె చేతికి ఉన్న పచ్చ బొట్టును చూసి తమ కూతరునే అని గుర్తించారు. బధిరుల సంస్థ నిర్వాహకులు మహారాష్ట్రలోని పుణెలో ఉన్న సంస్థ వారిని సంప్రదించి రమ్యని చెన్నైకి రప్పించారు. అలా సోషల్ మీడియా పుణ్యమాని రమ్య తన కుటుంబాన్ని చేరుకుంది.