బెంగాల్ లో అత్యధికం…కశ్మీర్ లో అత్యల్పంగా పోలింగ్

లోక్ సభ ఎన్నికల్లో భాగంగా ఇవాళ(ఏప్రిల్-29,2019)నాలుగోదశ పోలింగ్ జరుగుతుంది.9 రాష్ట్రాల్లోని 72 లోక్ సభ స్థానాలకు నాలుగోదశలో భాగంగా ఇవాళ పోలింగ్ జరుగుతుంది. మధ్యాహ్యాం 2గంటల వరకు వెస్ట్ బెంగాల్ లో అత్యధికంగా 52.37 శాతం పోలింగ్ నమోదైంది.అత్యల్పంగా జమ్మూకశ్మీర్ లో 6.66 శాతం పోలింగ్ నమోదైంది.జార్ఖండ్ లో్ 44.90శాతం,రాజస్థాన్ లో 44.62శాతం,బీహార్ లో 37.71శాతం,మధ్యప్రదేశ్ లో 43.44శాతం,మహారాష్ట్రలో 29.93శాతం,ఒడిషాలో 35.79 శాతం,ఉత్తరప్రదేశ్ లో 34.42శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ ప్రకటించింది.
బీహార్ లోని 5లోక్ సభ స్థానాలకు,మధ్యప్రదేశ్ లోని 6స్థానాలకు,మహారాష్ట్రలోని 17స్థానాలకు,ఒడిషాలోని 6స్థానాలకు,రాజస్థాన్ లోని 13స్థానాలకు,ఉత్తరప్రదేశ్ లోని 13స్థానాలకు,వెస్ట్ బెంగాల్ లోని 8స్థానాలకు,జార్ఖండ్ లోని 3స్థానాలకు,జమ్మూకశ్మీర్ లోని 1లోక్ పభ స్థానానికి ఇవాళ పోలింగ్ జరుగుతుంది