Gyanvapi Temple: కాశీలో ప్రతిదీ పరమ శివుడికి చెందినదే: కేంద్ర మంత్రి

వారణాసిలో ప్రతి వస్తువు, ప్రతి అంశము ఆ పరమ శివుడికి చెందినదేనని కేంద్ర మంత్రి ఎస్పీ సింగ్ బఘేల్ అన్నారు.

Gyanvapi Temple: కాశీలో ప్రతిదీ పరమ శివుడికి చెందినదే: కేంద్ర మంత్రి

Minister

Updated On : May 24, 2022 / 5:18 PM IST

Gyanvapi Temple: వారణాసిలో ప్రతి వస్తువు, ప్రతి అంశము ఆ పరమ శివుడికి చెందినదేనని కేంద్ర మంత్రి ఎస్పీ సింగ్ బఘేల్ అన్నారు. గత కొన్ని రోజులుగా వారణాసిలోని జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో సర్వే వ్యవహారంపై కేంద్ర మంత్రి ఎస్పీ సింగ్ బఘేల్ స్పందించారు. మంగళవారం ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న బఘేల్..ఈ వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగం కంటే ఎవరూ గొప్పవారు కాదని, ప్రభుత్వం, న్యాయవ్యవస్థపై ప్రజలకు నమ్మకం ఉందని కేంద్రమంత్రి అన్నారు. పరమశివుడు కాశీని స్థాపించాడని మరియు అక్కడ ఉన్నదంతా శివుడికే చెందుతుందని ఎస్పీ సింగ్ బఘేల్ వ్యాఖ్యానించారు. “ఒక కౌలుదారు ఏ దావాలోనైనా కోర్టును తప్పుదారి పట్టించవచ్చు, కానీ చివరికి, న్యాయం భూస్వామికి అనుకూలంగా వస్తుంది” అని బఘేల్ చెప్పారు. మరోవైపు జ్ఞానవాపి కేసులో విచారణను మేజిస్ట్రేట్ మే 26కు వాయిదా వేశారు.

Other Stories:Gyanvapi Mosque: జ్ఞానవాపి కేసులో విచారణ వాయిదా.. ఎల్లుండి ముస్లిం పిటిషనర్ల వాదనలకు చాన్స్

హిందూ వర్గాల వైపు పిటిషన్ ను తిరస్కరించాలన్న ముస్లిం వర్గాల వాదనను మే 26న వినిపించాలని కోర్టు సూచించింది. జ్ఞాన్‌వాపి మసీదు ప్రాంగణంలో కోర్టు తప్పనిసరి చేసిన వీడియోగ్రఫీ సర్వే నివేదికపై అభ్యంతరాలను దాఖలు చేయడానికి హిందూ మరియు ముస్లిం పక్షాలకు కోర్టు ఒక వారం సమయం ఇచ్చిందని జిల్లా ప్రభుత్వ న్యాయవాది రాణా సంజీవ్ సింగ్ చెప్పారు. జ్ఞానవాపి – శృంగార్ గౌరీ ప్రాంగణంలో మసీదు ఏర్పాటు చేశారని..మసీదు ఉన్నా..అక్కడ ఉన్న హిందూ దేవతల విగ్రహాలకు నిత్యా పూజలు చేసేలా కోర్టు అనుమతి ఇవ్వాలని ఢిల్లీకి చెందిన నలుగురు హిందూ మహిళలు వారణాసి జిల్లా కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో కోర్టు మసీదు ప్రాంగణంలో సర్వేకు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో అన్నీ అవాంతరాలు దాటుకుని జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో వీడియో సర్వే నిర్వహిస్తున్న సమయంలో మసీదులో శివ లింగం బయటపడడం ఈ ఘటన కొత్త మలుపు తీసుకుంది.