Gyanvapi Mosque: జ్ఞానవాపి కేసులో విచారణ వాయిదా.. ఎల్లుండి ముస్లిం పిటిషనర్ల వాదనలకు చాన్స్

జ్ఞానవాపి కేసులో తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేశారు. మసీదు పరిసరాల్లో చేసిన సర్వేలో శివలింగం అంశంపై సోమవారం ధర్మాసనం విచారణ జరిపింది. ఇరు వైపు వాదనలు వినడంతో పాటు కమిషన్ సర్వే నివేదికపై అభ్యంతరాలుంటే ఏడు రోజుల్లోగా తెలపాలని వెల్లడించింది.

Gyanvapi Mosque: జ్ఞానవాపి కేసులో విచారణ వాయిదా.. ఎల్లుండి ముస్లిం పిటిషనర్ల వాదనలకు చాన్స్

Gyanvapi

Gyanvapi Mosque: జ్ఞానవాపి కేసులో తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేశారు. మసీదు పరిసరాల్లో చేసిన సర్వేలో శివలింగం అంశంపై సోమవారం ధర్మాసనం విచారణ జరిపింది. ఇరు వైపు వాదనలు వినడంతో పాటు కమిషన్ సర్వే నివేదికపై అభ్యంతరాలుంటే ఏడు రోజుల్లోగా తెలపాలని వెల్లడించింది.

తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించారు న్యాయమూర్తి ఎక్ విశ్వేష్. మసీదులో శివలింగం నిత్యపూజలు జరుపుకునేందుకు అనుమతులు ఇవ్వాలని నలుగురు హిందువులు కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై ముస్లిం తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేస్తూ కౌంటర్ పిటిషన్ వేశారు.

దీనిపై విచారణ జరుపుతున్న వారణాసి కోర్టు ముస్లిం తరపు పిటిషనర్ వాదనలను గురువారం వినిపించాలని ఆదేశించింది.

Read Also: జ్ఞానవాపి మసీదు కేసులో వాదనలు విన్న సుప్రీం కోర్టు

ప్రార్థనా స్థలాల చట్టం ప్రకారం.. ఈ వ్యాజ్యం నిషేధించబడిందని మసీదు కమిటీ వాదించగా, హిందూ పిటిషనర్లు సర్వే నివేదికను పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు. పెండింగ్‌లోని ప్రొసీడింగ్‌లను “విచారణ, అన్ని మధ్యంతర, అనుబంధ విచారణల” కోసం జిల్లా జడ్జి, వారణాసికి బదిలీ చేయాలని సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించిన తర్వాత వారణాసి కోర్టు సోమవారం కేసును విచారణను ప్రారంభించింది.