బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు ఘటన.. 15కు పెరిగిన మృతుల సంఖ్య

బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు ఘటన.. 15కు పెరిగిన మృతుల సంఖ్య

Updated On : February 13, 2021 / 10:52 AM IST

Explosion at a fireworks factory : తమిళనాడులో మరోసారి బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు కల్లోలం సృష్టించింది. ప్రమాదంలో 15 మంది చనిపోగా పలువురు గాయపడ్డారు. పేలుడుపై ప్రధాని నరేంద్రమోడీ, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, రాహుల్ గాంధీలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అసలు అక్కడ పేలుడు ఎందుకు జరిగింది? బ్లాస్టింగ్‌కు కారణాలేంటి? సత్తూరు జిల్లాలోని బాణాసంచా తయారీ కర్మాగారంలో భారీ పేలుడు జరిగింది. విరుద్ నగర్ జిల్లా వెంబ కొట్టాయ్ వద్ద ఒక ప్రైవేట్ బాణాసంచా ఫ్యాక్టరీ సిబ్బంది బాణాసంచా తయారీకి కొన్ని రసాయనాలను కలుపుతున్న సమయంలో ప్రమాదం జరిగింది. భారీ పేలుడుతో అక్కడికక్కడే పదిహేను మంది మృతి చనిపోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటా 45 గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని, పేలుళ్ల చాలాసేపు వినిపించాయని ప్రత్యక్ష్య సాక్షులు చెబుతున్నారు.

ప్రమాదం జరిగిన వెంటనే.. సత్తూరు, శివకాశి, వెంబకొట్టై నుంచి 5 ఫైరింజన్‌లు ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపుకి తెచ్చాయి. సుమారు నాలుగు బాణసంచా తయారీ షెడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. గాయపడిన వారిని సత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు తెలిపారు అధికారులు. ఎర్త్‌మూవర్‌తో శిథిలాలను తొలిగించి, ఇంకెవరైనా చిక్కుకున్నారేమో అని చెక్‌ చేశామన్నారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు పరిహారం ప్రకటించారు తమిళనాడు సీఎం పళనిస్వామి. ఒక్కో కుటుంబానికి 3 లక్షల రూపాయలు, తీవ్ర గాయాలపాలైన వారికి లక్ష రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు.

మరోవైపు, కేంద్ర ప్రభుత్వం కూడా పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయలు, క్షతగాత్రులకు 50వేల రూపాయలు చొప్పున పరిహారం ప్రకటించనట్టు తెలిపింది పీఎంవో. మనసు చాలా దుఃఖంతో ఉందన్న మోదీ.. ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నానని, బాధిత కుటుంబాలకు సహాయం చేయడానికి అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారంటూ ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్లో తెలిపారు.

బాధిత కుటుంబాలకు రాహుల్ గాంధీ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మనస్సు బాధితుల గురించి ఆలోచిస్తూ ఉందంటూ ట్వీట్ చేశారు. తక్షణ రక్షణ, బాధిత కుటుంబాలకు మద్దతుతో పాటు ఉపశమనం అందించాలని నేను రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపరాఉ రాహుల్ గాంధీ. తీవ్ర ఆవేదనకు గురయ్యానంటూ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. మరణించిన కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నానని తెలిపారు.