IMD Red Alert : పలు రాష్ట్రాల్లో అతి భారీవర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ

రాబోయే రెండు మూడు రోజుల్లో ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు శనివారం వెల్లడించారు.

IMD Red Alert : పలు రాష్ట్రాల్లో అతి భారీవర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ

Extremely Heavy Rains

Updated On : August 12, 2023 / 10:31 AM IST

IMD Issues Red Alert : రాబోయే రెండు మూడు రోజుల్లో ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు శనివారం వెల్లడించారు. ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. వాతావరణ శాఖ ప్రకారం ఆగస్టు 12 మరియు 13 తేదీల్లో తూర్పు యూపీలో, ఆగస్టు 13, 14 తేదీల్లో పశ్చిమ యూపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. (IMD Issues Red Alert)

MiG-29 fighter jets : శ్రీనగర్ ఎయిర్‌బేస్ వద్ద మిగ్-29 ఫైటర్ జెట్ మోహరింపు

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు మూడు రోజులపాటు అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని భారతీయ వాతావరణశాఖ శనివారం వెల్లడించింది. అతి భారీవర్షాల నేపథ్యంలో ఐఎండీ డెహ్రాడూన్, పౌరీ గర్వాల్, నైనిటాల్, ఇతర జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసింది. (IMD Issues Red Alert) తీవ్ర వర్షపాతం కారణంగా డెహ్రాడూన్, పౌరీ గర్వాల్, నైనిటాల్, ఉధమ్ సింగ్ నగర్, తెహ్రీ గర్వాల్, చంపావత్ జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు.

Ukraine : యుక్రెయిన్ మిలటరీ రిక్రూట్‌మెంట్ చీఫ్‌లపై జెలెన్స్కీ వేటు

ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో మేఘావృతమైన ఆకాశంతో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉంది. ఆగస్టు 13న హర్యానా, పంజాబ్‌లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. బీహార్, జార్ఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఆగష్టు 11 నుంచి 13వ తేదీ వరకు బీహార్, సబ్-హిమాలయన్ పశ్చిమ బెంగాల్, సిక్కింలలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు చెప్పారు.