Mother Tongue: మాతృభాష బోధించని పాఠశాలలపై రూ.2లక్షల ఫైన్
మాతృభాష బోధించడం కంపల్సరీ చేసినప్పటికీ స్కూల్ మేనేజ్మెంట్ నిర్లక్ష్య పెట్టడంతో రూ.2లక్షల ఫైన్ విధించారు పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ. పంజాబ్ అసెంబ్లీ పంజాబీతో పాటు ఇతర భాషల....

Punjabi Language
Mother Tongue: మాతృభాష బోధించడం కంపల్సరీ చేసినప్పటికీ స్కూల్ మేనేజ్మెంట్ నిర్లక్ష్య పెట్టడంతో రూ.2లక్షల ఫైన్ విధించారు పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ. పంజాబ్ అసెంబ్లీ పంజాబీతో పాటు ఇతర భాషల నేర్చుకునే బిల్ పాస్ చేసిన తర్వాత ఈ ఆదేశాలిచ్చారు. ఒకటో తరగతి నుంచి 10తరగతి వరకూ స్టూడెంట్లందరికీ పంజాబీ కంపల్సరీ చేశారు.
‘మాతృభాషను ప్రమోట్ చేయాలనే ఉద్దేశ్యంతో పంజాబ్ లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకూ పంజాబీని తప్పనిసరి చేశాం. దీనిని అతిక్రమిస్తే ఆ స్కూల్స్ కు రూ.2లక్షలు జరిమానా విధిస్తాం’ అని చన్నీ ట్వీట్ లో వెల్లడించారు.
ఇప్పుడు ఆఫీసుల్లో కూడా పంజాబీ తప్పనిసరి చేశారు. రాష్ట్రంలోని అన్ని బోర్డులపైనా పంజాబీలోనే రాయాలని నిబంధన కూడా పెట్టారు. రూల్స్ పాటించకపోవడంతో ఫైన్ అమౌంట్ ను రూ.25వేల నుంచి రూ.50వేలకు.. రూ.లక్షకు.. రూ.2లక్షల వరకూ పెంచారు.
…………………………………………. : దెబ్బకొట్టారు..తిప్పికొట్టారు, ఐదుగురు ఉగ్రవాదుల హతం
పంజాబ్ అధికారిక భాష బిల్ 2021ను పంజాబ్ విధాన సభ అఫీషియల్ గా అనైన్స్ చేసి.. పంజాబ్ లాంగ్వేజ్ ను ప్రమోట్ చేయాలని ప్రయత్నిస్తుంది.