687 కాంగ్రెస్ ఫేస్ బుక్ పేజీలు డిలీట్

సార్వత్రిక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ కు ఊహించని షాక్ తగిలింది.తప్పులు వార్తలు ప్రచారం చేస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీకి చెందిన 687 పేజీలను,అకౌంట్లను ఫేస్ బుక్ తొలగించింది.కాంగ్రెస్ ఐటీ విభాగంతో అసోసియేట్ అయిన వ్యక్తులకు సంబంధించిన అకౌంట్స్ ని డిలీట్ చేసినట్లు సోమవారం(ఏప్రిల్-1,2019)ఫేస్ బుక్ ప్రకటించింది.
కేవలం ఫేక్ న్యూస్,కంటెంట్ ఆధారంగా ఈ అకౌంట్స్ ని తొలగించలేదని…అవాస్తవమైన ప్రవర్తనతో అనవసరపు చెత్త విషయాలను ఫేక్ ఐడీల ద్వారా ఫేస్ బుక్ లోకి పంపుతూ ఉన్నందువల్లే ఈ అకౌంట్స్,పేజీలను డిలీట్ చేయడం జరిగిందని ఫేస్ బుక్ సైబర్ సెక్యూరిటీ పాలసీ హెడ్ నథనైల్ గ్లీచర్ తెలిపారు.ఈ అకౌంట్లలోని అధికభాగం ఇప్పటికే గుర్తించి ఆటోమేటెడ్ సిస్టమ్ ద్వారా సస్పెండ్ చేయబడినట్లు ఆయన తెలిపారు. రాబోయే ఎన్నికలపై,ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు సంబంధించిన సమాచారం,ప్రత్యర్థులను విమర్శించడం,స్థానిక వార్లను పోస్ట్ చేయడం వంటి విషయాలను తొలగించబడ్డ ఫేస్ బుక్ పేజీల అడ్మిన్ లు చేశారని గ్లీచర్ తెలిపారు.
ఎన్నికల సమయంలో….ఉద్దేశ్యపూర్వకంగా దేశఎన్నికలను ప్రభావితం చేసేలా ఉండే చర్యలను గుర్తించి వాటిని ఆపాలని,తగిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలకు ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే.