Cricket With Umbrella: గొడుగుతో కూడా క్రికెట్ ఆడొచ్చని మీకు తెలుసా..! ఈ వీడియో చూస్తే..

ఇంగ్లాండ్  వర్సెస్ భారత్ మధ్య జరిగే టెస్ట్ మ్యాచ్ ను చూసేందుకు క్రికెట్ ప్రేమికులు తరలివచ్చారు. ఆట మధ్యలో వర్షం కారణంగా కొద్దిసేపు స్టేడియం బయటకు వచ్చారు. కొందరు వ్యక్తులు స్టేడియం బయట గొడుగుతో క్రికెట్ ఆడటం మొదలు పెట్టారు.

Cricket With Umbrella: గొడుగుతో కూడా క్రికెట్ ఆడొచ్చని మీకు తెలుసా..! ఈ వీడియో చూస్తే..

Umbrella

Updated On : July 2, 2022 / 12:57 PM IST

Cricket With Umbrella: బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్ vs ఇంగ్లండ్ రీషెడ్యూల్ ఐదో టెస్టు శుక్రవారం ప్రారంభమైంది. లంచ్‌ సమయానికి భారత్ స్కోర్ 53/2కు చేరింది. ఈ సమయంలో వర్షం పడింది. వర్షం కారణంగా రోజు రెండో సెషన్‌ను ఆలస్యంగా ప్రారంభించింది. ఆటలో తాత్కాలిక అంతరాయం ఏర్పడటంతో ఆటగాళ్ళు షెడ్యూల్ కంటే కొంచెం ఎక్కువసేపు డ్రెస్సింగ్‌లో ఉండవలసి వచ్చింది. కొంతమంది క్రికెట్ అభిమానులు స్టేడియం వెలుపల గొడుగుతో క్రికెట్ ఆడుతూ కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

India vs England: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్‌.. ఓపెన‌ర్లుగా క్రీజులోకి శుభ్‌మ‌న్, పుజారా

ఇంగ్లాండ్  వర్సెస్ భారత్ మధ్య జరిగే టెస్ట్ మ్యాచ్ ను చూసేందుకు క్రికెట్ ప్రేమికులు తరలివచ్చారు. ఆట మధ్యలో వర్షం కారణంగా కొద్దిసేపు స్టేడియం బయటకు వచ్చారు. కొందరు వ్యక్తులు స్టేడియం బయట గొడుగుతో క్రికెట్ ఆడటం మొదలు పెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోనీ స్పోర్ట్స్ నెట్ వర్క్ తన ట్విటర్ ఖాతాలో ఉంచింది. ఈ వీడియోను చూసిన పలువురు ‘గొడుగుతో కూడా క్రికెట్ ఆడొచ్చా’ అంటూ ఆసక్తికర కామెంట్లు చేసక్తున్నారు.

IndiaVsSA 4th T20I : సౌతాఫ్రికాపై భారత్ ఘన విజయం.. సిరీస్ సమం
ఈ వీడియోలో చేతిలో గొడుగు పట్టుకుని బ్యాటింగ్ చేస్తున్న బాలుడికి ఓవ్యక్తి బౌలింగ్ చేయడాన్ని చూడవచ్చు. ఇంతలో కొంతమంది అభిమానులు తమ ఫీల్డింగ్ స్థానాలను మార్పులు చేసుకోవటం కనిపిస్తుంది. చుట్టుపక్కల వారు బ్యాటింగ్ చేస్తున్న చిన్నారిని ప్రోత్సహిస్తూ కనిపించారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు సూపర్ బ్యాటింగ్.. బ్యాట్ సూపర్ గా ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.