Dead Body In Car: డ్రైవింగ్ సీట్లో తండ్రి…. పక్క సీట్లో కూతురి మృతదేహం.
కరోనా మహమ్మారి కారణంగా ఎప్పుడు చూడని దారుణాలను చూడాల్సి వస్తుంది. మనుషుల్లో మానవత్వాన్ని కూడా ఇది మంటగలుపుతుంది. తాజాగా జరిగిన ఓ ఘటన అందరిని కన్నీరు పెట్టిస్తుంది. వివరాల్లోకి వెళితే..

Dead Body In Car
Dead Body In Car: కరోనా మహమ్మారి కారణంగా ఎప్పుడు చూడని దారుణాలను చూడాల్సి వస్తుంది. మనుషుల్లో మానవత్వాన్ని కూడా ఇది మంటగలుపుతుంది. తాజాగా జరిగిన ఓ ఘటన అందరిని కన్నీరు పెట్టిస్తుంది. వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్ లోని జైపూర్ జిల్లా జల్వార్ గ్రామానికి చెందిన సీమకు కరోనా సోకింది. ఆమెను కోటాలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. నెలరోజులపాటు కరోనాతో పోరాడిన సీమా చివరకు కన్నుమూసింది.
మృతదేహాన్నని కోటాకు 85 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్వగ్రామం జల్వార్ కు తీసుకెళ్లేందుకు అంబులెన్స్ డ్రైవర్ 35,000 డిమాండ్ చేశాడు. దీంతో అంత ఇచ్చుకోలేని సీమా తండ్రి మృతదేహాన్ని ప్యాక్ చేసి ముందు సీటును పాడేలా కిందకు వంచి సీటు బెల్టుతో కదలకుండా కట్టి కంట కన్నీరు కార్చుకుంటూ కారు నడుపుతూ మృతదేహాన్ని ఇంటికి చేర్చాడు. అయితే మార్గమధ్యంలో కొందరు ఈ దృశ్యాలను తమ కెమెరాలో బందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఘటన విషయం జిల్లా జైపూర్ కలెక్టర్ కు తెలియడంతో ఆయన విచారణకు ఆదేశించాడు.
కాగా ఇటువంటి ఘటనలు చాలానే జరిగాయి. అంబులెన్స్ చార్జీలు భరించలేక ఆటోలలో కూడా మృతదేహాలను తరలించారు.