Video: ఆ ప్రాజెక్టు వద్దంటూ పోలీసులపై దాడి చేసిన స్థానికులు.. తీవ్ర ఉద్రిక్తత

ఇవాళ వందలాది మంది దుకాణదారులు, పోనీ సర్వీస్ ప్రొవైడర్లు నిరసనలో పాల్గొని "భారత్ మాతా కీ జై" అని నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.

Video: ఆ ప్రాజెక్టు వద్దంటూ పోలీసులపై దాడి చేసిన స్థానికులు.. తీవ్ర ఉద్రిక్తత

Updated On : November 25, 2024 / 7:05 PM IST

జమ్మూకశ్మీర్‌లోని రియాసి జిల్లాలోని కత్రాలో వైష్ణో దేవి పుణ్యక్షేత్రానికి ట్రెక్ మార్గంలో చేపడుతున్న రోప్‌వే ప్రాజెక్టుపై స్థానికులు ఆందోళన తెలిపారు. ఆ ప్రాజెక్టు వల్ల తమ దుకాణాలు కోల్పోవాల్సి వస్తుందని, ఉపాధి దొరకదని స్థానికులు అంటున్నారు.

ఇవాళ స్థానికులతో పాటు పోనీ సర్వీస్ ప్రొవైడర్లు కత్రా బేస్ క్యాంపు వద్ద పోలీసులతో ఘర్షణకు దిగారు. దీంతో పలువురు గాయపడ్డారు. శ్రీ మాతా వైష్ణో దేవి పుణ్యక్షేత్రం బోర్డు తారాకోట్ మార్గ్‌ని, సాంజీ ఛత్‌ను కలుపుతూ రూ.250 కోట్ల ప్యాసింజర్ రోప్‌వే ప్రాజెక్ట్‌ను కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది.

అప్పటి నుంచి కత్రాలో స్థానికులు నిరసనలు తెలుపుతున్నారు. ఈ రోప్‌వే పూర్తయితే యాత్రికులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. అయితే, ఈ ప్రాజెక్టు వల్ల తమ జీవనోపాధి దెబ్బతింటుందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇవాళ వందలాది మంది దుకాణదారులు, పోర్టర్లు, పోనీ సర్వీస్ ప్రొవైడర్లు నిరసనలో పాల్గొని “భారత్ మాతా కీ జై” అని నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.

పోలీసులపై వారు రాళ్లు రువ్వుతూ, దాడి చేస్తూ కలకలం రేపారు. సీఆర్పీఎఫ్ బలగాల వాహనం ఆ ప్రతిపాదిత ప్రాజెక్టు ప్రాంతం మీదుగా వెళ్తున్న సమయంలో స్థానికులు దాన్ని అడ్డుకుని ఘర్షణకు దిగారు. పోలీసులకు, స్థానికులకు మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసు.. సీఐడీ మాజీ అదనపు ఎస్పీ విజయపాల్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ..!