రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసు.. సీఐడీ మాజీ అదనపు ఎస్పీ విజయపాల్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ..!

సుప్రీంకోర్టు తీర్పుపై రఘురామకృష్ణరాజు హర్షం వ్యక్తం చేశారు.

రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసు.. సీఐడీ మాజీ అదనపు ఎస్పీ విజయపాల్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ..!

Updated On : November 25, 2024 / 6:28 PM IST

Raghu Rama Krishna Raju : ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సీఐడీ మాజీ అదనపు ఎస్పీ విజయ్ పాల్ కు ఎదురుదెబ్బ తగిలింది. తనపై ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో బెయిల్ మంజూరు చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు విజయ్ పాల్. సుదీర్ఘ వాదనల అనంతరం జస్టిస్ విక్రమ్ నాత్, జస్టిస్ ప్రసన్న ధర్మాసనం పిటిషన్ ను కొట్టివేసింది.

కస్టోడియల్ టార్చరే జరగలేదని, అరెస్ట్ వ్యవహారంతో తన క్లయింట్ విజయ్ పాల్ కు ఎలాంటి సంబంధం లేదని సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి వాదించారు. దీనికి రఘురామకృష్ణరాజు న్యాయవాది కౌంటర్ ఇచ్చారు. ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది. సుప్రీంకోర్టు తీర్పుపై రఘురామకృష్ణరాజు హర్షం వ్యక్తం చేశారు.

”సుమారు 55 నిమిషాల వాదనలు, ప్రతి వాదనలు జరిగాయి. ఆ తర్వాత ఇవాళ ఫైనల్ గా సుప్రీంకోర్టులో బెంచ్ నెంబర్ 6, ఐటెమ్ నెంబర్ 6.. విజయ్ పాల్ బెయిల్ పిటిషన్ ను కొట్టివేయడం జరిగింది. నాకు గుర్తు లేదు, నేను మర్చిపోయాను అని ఆయన రకరకాల విన్యాసాలతో పోలీసు అధికారులను, విచారణ అధికారులను తికమక చేశారు. మరిప్పుడు చూడాలి. సుమారు 2021 మే 14న జరిగింది. మరిప్పుడు 24లో ఉన్నాం. ఎన్నో సంవత్సరాల తర్వాత.. ఈ న్యాయ పోరాటంలో కచ్చితంగా నేను నెగ్గుతాను అనే పరిపూర్ణ విశ్వాసం అయితే నాకుంది” అని రఘురామకృష్ణరాజు అన్నారు.

Also Read : పరారీలో దర్శకుడు రాంగోపాల్ వర్మ..! ఏపీ పోలీసుల వేట..