అనారోగ్యం ఉన్నా సరే..బడ్జెట్ ప్రసంగంలో సీతమ్మ రికార్డ్ 

  • Published By: veegamteam ,Published On : February 1, 2020 / 09:36 AM IST
అనారోగ్యం ఉన్నా సరే..బడ్జెట్ ప్రసంగంలో సీతమ్మ రికార్డ్ 

Updated On : February 1, 2020 / 9:36 AM IST

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2020-21 బడ్జెట్ ప్రసంగంలో రికార్డ్ సృష్టించారు. సుదీర్ఘమైన బడ్జెట్ ప్రసంగంలో తన సొంత రికార్డును తానే బ్రేక్ చేశారు. గత బడ్జెట్ ప్రసంగం రెండు గంటల..17 నిమిషాలు కొనసాగగా.. ఈ సంవత్సరం..రెండు గంటల 41 నిమిషాల పాటు ప్రసంగాన్ని కొనసాగించి రికార్డు సృష్టించారు. ప్రసంగంలో భాగంగా..ఆమె . ఈ క్రమంలో ఆమె శ్వాస తీసుకోవటానికి చాలా ఇబ్బంది పడ్డారు. అనారోగ్యంతో బాధపుడుతున్న ఆమె ప్రసంగాన్ని పూర్తి చేయకుండానే  ఆపివేశారు. 

ఈ బడ్జెట్ సుదీర్ఘంగా ఉండటం..దానికి తోడు ఆమెకు అనారోగ్యంగా ఉండటంతో ప్రసంగాన్ని ఇంకా రెండు పేజీలు ఉందనగానే ఆపివేయాల్సి వచ్చింది. ప్రసంగాన్ని కొనసాగించటానికి ఆమె శతవిధాలుగా యత్నించారు. 

బీపీ,లో షుగర్ తో ఇబ్బంది పడుతున్నాసరే..ప్రసంగాన్ని చాలాసేపు ఆపివేయకుండా  కొనసాగించారు. నీరసంగా అనిపించి  మధ్య మధ్యలో చెమటను తుడుచుకున్నారు. ఈ క్రమంలో మరో మంత్రి హర్సిమ్రత్ కౌర్ ఇచ్చిన మంచినీరు త్రాగారు.అనంతరం ప్రసంగాన్ని కొనసాగించారు. లో షుగర్ సమస్య తలెత్తటంతో తోటి మంత్రులు అందించిన మిఠాయిని తిని మంచినీళ్లు తాగి ప్రసంగాన్ని కొనసాగించారు. 

బడ్జెట్ ప్రసంగాన్ని ఆపకుండా కొనసాగిస్తున్న ఆమెను తోటి మంత్రులు ఆందోళన చెందారు. ప్రసంగాన్ని కుదించాలని సూచించారు. ఆమెకు బీపీ డౌన్ అయిపోయిందని కూర్చోమని సలహా ఇచ్చారు. దీంతో ఆమె ఇక రెండు పేజీలు మాత్రమే ఉన్నాయనీ..తెలిపారు. కానీ సహచరులు సూచనలతో ఎట్టకేలకు రెండు పేజీలు ఉందనగానే ఆపివేశారు. దీంతో మిగిలిన బడ్జెటన్ రాజ్యసభలో ప్రవేశ పెడతాయని ఆర్థిక సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నట్లుగా సమాచారం.  

కాగా..2003-04 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ ప్రవేశపెట్టిన అప్పటి ఆర్థిక మంత్రి జశ్వంత్ సింగ్ 2 గంటల 13 నిమిషాలు ప్రసగించి సీతమ్మ తరువాత స్థానంలో ఉన్నారు.
2014-15 ఆర్థిక బడ్జెట్ ప్రసంగాన్ని చేసిన అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2 గంటల 10 నిమిషాల పాటు ప్రసంగించి మూడవ స్థానంలో నిలిచారు.