ఫిరోజ్ షా కోట్ల స్టేడియంకు అరుణ్ జైట్లీ పేరు

  • Published By: chvmurthy ,Published On : August 27, 2019 / 11:51 AM IST
ఫిరోజ్ షా కోట్ల స్టేడియంకు అరుణ్ జైట్లీ పేరు

Updated On : August 27, 2019 / 11:51 AM IST

ఢిల్లీ : ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియం పేరు మార్చనున్నారు. స్టేడియంకు కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ పేరు పెట్టనున్నారు. ఈ మేరకు ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ సంఘం(డీడీసీఏ) నిర్ణయించింది. గతంలో అరుణ్ జైట్లీ  డీడీసీఏ అధ్యక్షుడిగా పని చేశారు. బీసీసీఐలోనూ ఆయన ప్రధాన పదవులను అలంకరించి.. క్రికెట్‌ రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు ఎంతగానో కృషి చేశారు.

విరాట్‌ కోహ్లీ, వీరేంద్ర సెహ్వాగ్‌, గౌతమ్‌ గంభీర్‌, ఆశిష్‌ నెహ్రా, రిషభ్‌ పంత్‌ ఇంకా చాలామంది క్రికెటర్లు దేశం గర్వించేలా చేశారంటే అది అరుణ్‌ జైట్లీ మద్దతు, ప్రోత్సాహం వల్లే..’ అని డీడీసీఏ అధ్యక్షుడు రజత్‌ శర్మ అన్నారు.

కోట్లా స్టేడియంలో మౌలిక సదుపాయాల కల్పన, స్టాండ్ల నిర్మాణం, స్టేడియం ఆధునికీకరణ, సీట్లు పెంపు  వంటివి జైట్లీ ఆధ్వర్యంలోనే జరిగాయి. 
సెప్టెంబర్ 12న జరిగే కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, క్రీడామంత్రి కిరణ్‌ రిజిజు ముఖ్య అతిథులుగా  హాజరు కానున్నారు.