Women World Cup: అక్టోబర్ నుంచి షురూ.. ఫిపా ప్రపంచకప్‌-2022 షెడ్యూల్‌ విడుదల

ఫిపా అండర్-17 మహిళల ఫుట్‌బాల్ ప్రపంచ కప్-2022 షెడ్యూల్‌ను స్థానిక ఆర్గనైజింగ్ కమిటీ (LOC) బుధవారం అధికారికంగా ప్రకటించింది. భారత్ రెండోసారి ఆతిథ్యమివ్వనున్న ఈ ప్రపంచ స్థాయి క్రీడా సంబురం భువనేశ్వర్ లో అక్టోబర్ 11 నుండి 30 వరకు జరగనుంది. అక్టోబర్ 30న ముంబైలో ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.

Women World Cup: అక్టోబర్ నుంచి షురూ.. ఫిపా ప్రపంచకప్‌-2022 షెడ్యూల్‌ విడుదల

Fifa

Updated On : June 15, 2022 / 6:10 PM IST

Women World Cup: ఫిపా అండర్-17 మహిళల ఫుట్‌బాల్ ప్రపంచ కప్-2022 షెడ్యూల్‌ను స్థానిక ఆర్గనైజింగ్ కమిటీ (LOC) బుధవారం అధికారికంగా ప్రకటించింది. భారత్ రెండోసారి ఆతిథ్యమివ్వనున్న ఈ ప్రపంచ స్థాయి క్రీడా సంబురం భువనేశ్వర్ లో అక్టోబర్ 11 నుండి 30 వరకు జరగనుంది. అక్టోబర్ 30న ముంబైలో ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ క్రీడా వేడుకలో మొత్తం 16 జట్లు పాల్గొంటాయి. ఒడిశా, గోవా, మహారాష్ట్ర వేదికలుగా మొత్తం 32 మ్యాచ్ లు జరగనున్నాయి.

Fifa (1)

షెడ్యూల్ ప్రకారం.. 24 గ్రూప్ స్టేజ్ మ్యాచ్ లు అక్టోబర్ 18 వరకు ముగుస్తాయి. అక్టోబర్ 21, 22 తేదీల్లో క్వార్టర్-ఫైనల్ రౌండ్ మ్యాచ్ లు జరుగుతాయి, ఆ తర్వాత సెమీ-ఫైనల్ అక్టోబర్ 26న గోవా వేదికగా జరుగుతుంది. అక్టోబర్ 30న నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగుతుంది. ఇదిలాఉంటే గ్రూప్ దశలో అక్టోబరు 11, 14, 17 తేదీల్లో భారత్ ఆడబోయే మూడు మ్యాచ్ లకు భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది.