Covid Hospital Fire : మహారాష్ట్ర కోవిడ్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం..13 మంది రోగులు మృతి

మహారాష్ట్రలో అగ్నిప్రమాదం సంభవించింది. విజయ్ వల్లభ కోవిడ్ ఆస్పత్రిలో మంటలు చెలరేగాయి.

Covid Hospital Fire : మహారాష్ట్ర కోవిడ్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం..13 మంది రోగులు మృతి

Fire Accident In Covid Hospital At Maharashtra 13 Patients Kills

Updated On : April 23, 2021 / 7:53 AM IST

fire accident in covid Hospital : మహారాష్ట్రలో అగ్నిప్రమాదం సంభవించింది. విజయ్ వల్లభ కోవిడ్ ఆస్పత్రిలో మంటలు చెలరేగాయి. ఐసీయూలో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి. ఆస్పత్రిలోని 13 మంది కోవిడ్ రోగులు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటన పాల్ఘర్ జిల్లా వాసాయిలోని కోవిడ్ ఆస్పత్రిలో చోటుచేసుకుంది.

తొలుత ఐసీయులో మంటలు చెలరేగాయి. నిమిషాల్లోనే బిల్డింగ్ మొత్తం మంటలు వ్యాపించాయి. ప్రమాద సమయంలో ఆసుపత్రిలో 90మంది పేషంట్లు ఉన్నారు.

మంటలు చుట్టు ముట్టడంతో.. ఎవరూ బయటకు వెళ్లలేక పోయారు. క్షణాల్లోనే మంటల్లో సజీవదహనమయ్యారు. మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా మారాయి.