ఢిల్లీ ఎయిమ్స్ లో అగ్నిప్రమాదం

  • Published By: venkaiahnaidu ,Published On : March 24, 2019 / 02:02 PM IST
ఢిల్లీ ఎయిమ్స్ లో అగ్నిప్రమాదం

Updated On : March 24, 2019 / 2:02 PM IST

ఢిల్లీ ఎయిమ్స్ లో అగ్నిప్రమాదం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్ లోని ట్రామా సెంటర్ లోని ఓ ఆపరేషన్ థియేటర్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. లోపలి నుంచి మంటలు బయటికి వ్యాపించడంతో భయంతో ప్రజలు పరుగులు తీశారు. షాట్ సర్కూట్ కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చని సిబ్బంది అనుమానిస్తున్నారు. 4 ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చినట్లు చీఫ్ ఫైర్ ఆఫీసర్ అతుల్ గార్గ్ తెలిపారు.ఎవరికీ ఏ ప్రమాదం జరుగలేదన్నారు.పొగ కారణంగా పైన ఫ్లోర్ కాలిచేయబడినట్లు తెలిపారు.