Madhya Pradesh: మధ్య‌ప్రదేశ్‌లో విచిత్ర ఘటన.. చేతి పంపు నుంచి నీటితో పాటు ఎగిసిపడుతున్న మంటలు .. వీడియో వైరల్

మంచినీటి కోసం ఏర్పాటు చేసిన చేతిపంపు నుంచి మీరెప్పుడైనా మంటలు ఎగజిమ్మడం చూశారా. మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని ఓ గ్రామంలో ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. భూమిలో నుంచి నీటితో పాటు మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ విచిత్ర ఘటనతో షాక్ తిన్న గ్రామస్తులు అధికారులకు సమాచారం అందించారు.

Madhya Pradesh: మధ్య‌ప్రదేశ్‌లో విచిత్ర ఘటన.. చేతి పంపు నుంచి నీటితో పాటు ఎగిసిపడుతున్న మంటలు .. వీడియో వైరల్

Viral VIdeo

Updated On : August 25, 2022 / 3:28 PM IST

Madhya Pradesh: మధ్య ప్రదేశ్ లోని విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఓ గ్రామంలో చేతి పంపునుంచి భూమిలో నుంచి నీరు ఎగజిమ్మడొంతో పాటు.. మంటలుసైతం ఎగిసిపడుతున్నాయి. ఈ ఘటనను చూసిన స్థానికులు ఆశ్చర్య పోతున్నారు. నీటి పంపునుంచి మంటలు ఎగసిపడుతుండటాన్ని చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆ ప్రాంతంకు తరలివస్తున్నారు.

Congress President election: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక వాయిదా.. గాంధీ కుటుంబం పోటీలో లేకపోవడమే కారణమా?

ఈ విచిత్ర ఘటన మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని కుచ్చర్ గ్రామం బక్స్‌హవా లో చోటు చేసుకుంది. ఛతర్ పూర్ జిల్లా కేంద్రం నుంచి బక్స్‌హవా పంచాయతీ పది కిలో మీటర్ల దూరంలో ఉంది. గ్రామంలో చేతి పంపుకోసం బోరు వేశారు. అయితే అది రిపేరు రావడంతో దానిపైకప్పును తొలగించారు.

తాజాగా ఆ చేతిపంపు నుంచి భూమిలో నుంచి నీటితో పాటు మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ ఘటనను చూసి షాక్ తిన్న స్థానిక ప్రజలు అధికారులకు సమాచారం అందించారు. ఇందుకు సంబంధించిన వీడియోను కొందరు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదే ప్రాంతంలో గతంలోనూ మంటలు ఇలానే ఎగిసిపడినట్లు కొందరు స్థానికులు పేర్కొంటున్నారు.