కరోనా టెస్టింగ్ కి స్వదేశీ కిట్స్…లైసెన్స్ పొందిన మొదటి సంస్థ ఇదే

భారతదేశంలో తొలిసారిగా అహ్మదాబాద్ చెందిన సంస్థ కరోనా వైరస్ కిట్ల తయారీకి సంబంధించిన లైసెన్స్ ను సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్(CDSCO) నుంచి పొందింది. ఈ సంస్థ rRT-PCR యంత్రాలను ఉపయోగించి వైరస్ ని పరీక్షించే కిట్లను తయారు చేస్తుంది. కోసారా డయాగ్నోస్టిక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మంగళవారం(మార్చి 17, 2020)ఈ లైసెన్స్ ను పొందింది. ఈ లైసెన్స్ పొందటానికి దాదాపు ఆ కంపెనీకి ఒక నెల సమయం పట్టింది.
కరోనా వైరస్ కు సంబంధించిన కిట్ల తయారీని అమెరికాలోని కో – డయాగ్నోస్టిక్ సిఎస్ ఇంక్, అంబలాల్ సారాభాయ్ ఎంటర్ప్రైజెస్ ఆఫ్ ఇండియాతో కలిసి కోసారా డయాగ్నోస్టిక్స్ కలిసి తయారు చేస్తారు. కోసారా డయాగ్నోస్టిక్స్ CEO మెుహల్ కార్తికేయ సారాభాయ్ మాట్లాడుతూ…. మా భాగస్వామి అయిన అమెరికా నుంచి ముడిపదార్ధాలు వస్తాయి త్వరలో కిట్లను తయారు చేస్తాం అని చెప్పారు.
See Also | భారతదేశంలో కరోనా వైరస్ ‘కమ్యూనిటీ’ వ్యాప్తి లేదు : ICMR వెల్లడి
ప్రస్తుతం ఉపయోగిస్తున్న కిట్ లు రోగ నిర్ధారణ చేయటానికి ఐదు గంటల సమయం పడుతుంది. కొత్తగా తయారయ్యే కిట్లు మాత్రం రెండు నుంచి రెండున్నర గంట్లలోనే ఫలితాలను ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ప్రాణాంతకమైన కోవిడ్ 19 రోగనిర్ధారణ కిట్ల కోసం ఉన్న డిమాండ్ ను తీర్చగల మా సామర్ధ్యంపై మాకు నమ్మకం ఉందని పేర్కొన్నారు.
ప్రభుత్వానికి ఈ కిట్లను ఎంత ధరకు విక్రయిస్తుందో స్పష్టత రాలేదు. కానీ ప్రస్తుతం ఇతర దేశాల నుంచి కొనుగోలు చేస్తున్న ఖర్చు కంటే తక్కువ ధరే ఉంటుందని కోసారా డయాగ్నోస్టిక్స్ CEO మెుహల్ కార్తికేయ సారాభాయ్ అన్నారు.