చంద్రయాన్-2: విశ్వంలో విహరిస్తున్న ముంబై లాల్‌భాగ్ గణేషుడు

దేశంలోనే ప్రముఖ వినాయక ఆలయం… ముంబైలోని లాల్‌భాగ్ గణపతి ఆలయం. ప్రతీ సంవత్సరం వచ్చే వినాయక చవితికి గణనాథుడు ఏ రూపంతో..ఏ విధంగా దర్శనమిస్తారా? అని భక్తులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తుంటారు. ఈ ఆలయం విశేషం అదే. ప్రతీ ఏటా విఘ్నాలను తొలగించే వినాయక స్వామి ఎటువంటి అవతారంలో కనిపిస్తారా… అని భక్తులు ఉత్కంఠగా ఎదురుచూస్తుంటారు. ఎప్పటికప్పుడు భక్తుల్ని అలరించటంలో కమిటీ సభ్యులు వినూత్నంగా స్వామి దర్శనాన్ని కల్పింస్తుంటారు.
ఈ సంవత్సరం స్వామి అంతరిక్షంలో విహరిస్తున్నట్లుగా విగ్రహాన్ని రూపొందించారు. చుట్టూ గ్రహాలు, వాటి మధ్యలో వ్యోమగాములూ రోదసిలో ఉండగా… లాల్‌భాగ్ గణపతి ప్రత్యక్షమై.. భక్తులను కటాక్షించారు. శుక్రవారం (ఆగస్టు 30)న 20 అడుగుల ఎత్తులో గణేషుడు దర్శనంతో భక్తులంతా తన్మయత్వంలో మునిగిపోయారు.
గణపతి పప్పా మోరియా అంటు జైకొట్టారు.ఈ సంవత్సరం ఇస్రో ప్రతిష్టాత్మక అంతరిక్ష మిషన్ చంద్రయాన్ -2 అనే అంశంపై గణేషుడిని రూపొందించారు. చంద్రయాన్ -2 జూలై 22 న ప్రయోగించబడింది. ఈ సందర్భంగా ఈ సంవత్సరం కమిటీ నిర్వాహకులు చంద్రయాన్ -2ను విజయాన్ని పురస్కరించుకుని విశ్వంలో విహరిస్తున్నవినాయకుడు దివ్వమంగళ రూపాన్ని ఆవిష్కరించారు.
#WATCH Mumbai: First look of Ganpati idol at Lalbaugcha Raja was unveiled, today, ahead of #GaneshChaturthi. #Maharashtra pic.twitter.com/yntrZRuqht
— ANI (@ANI) August 30, 2019