తమిళనాడులో భారీ అగ్నిప్రమాదం.. ఐదుగురు సజీవ దహనం

  • Published By: sreehari ,Published On : October 23, 2020 / 09:36 PM IST
తమిళనాడులో భారీ అగ్నిప్రమాదం.. ఐదుగురు సజీవ దహనం

Updated On : October 23, 2020 / 9:43 PM IST

cracker factory fire : తమిళనాడులోని ఫైర్ వర్క్స్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికుల్లో ఐదురుగు మంటల్లోనే సజీవ దహనమయ్యారు. మరికొంత మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి.



వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. తమిళనాడులోని విరుదునగర్‌ జిల్లా ఎరిచ్చనత్తం ప్రాంతంలోని ప్రైవేట్ బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు ఘటన జరిగింది.



మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. రెండు గంటల పాటు శ్రమించి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.



దీపావళి పండగ సమీపిస్తుండటంతో బాణాసంచా తయారీలో దాదాపు 50 మంది కార్మికులు నిమగ్నమై ఉన్నారు.



బాణసంచా తయారీకి ఉపయోగించే రసాయనాల్లో ఘర్షణ ఏర్పడంతో ఈ అగ్ని ప్రమాదం సంభవించినట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.