Karnataka Election 2023: కర్ణాటక ఎన్నికలవేళ బీజేపీకి షాకిచ్చిన మాజీ సీఎం జగదీశ్ షెట్టర్.. కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం..

జగదీష్ షెట్టర్ కుటుంబానికి జనసంఘ్ రోజుల నుంచి బీజేపీ పార్టీతో అనుబంధం ఉంది. బీజేపీలో ఉన్నప్పుడు మంత్రిగా, స్పీకర్ గా, ప్రతిపక్ష నేతగా, ముఖ్యమంత్రిగా పనిచేశారు. లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన షెట్టర్ కాంగ్రెస్ లో చేరడం బీజేపీకి పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పొచ్చు.

Karnataka Election 2023: కర్ణాటక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం నెలకొంది. ఈసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన విషయం విధితమే. ప్రస్తుతం నామినేషన్ల దాఖలు ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు తమతమ అభ్యర్థులను నియోజకవర్గాల వారిగా ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ అభ్యర్థుల జాబితాలను పలుదఫాలుగా విడుదల చేసింది. మాజీ సీఎం, బీజేపీ నేత జగదీశ్ షెట్టర్‌కు బీజేపీ టికెట్‌ను కేటాయించలేదు. దీంతో ఆగ్రహించిన షెట్టర్ బీజేపీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆదివారం ప్రకటించారు. సోమవారం ఉదయం ఆయన బెంగళూరులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వెళ్లి జాతీయ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణదీప్ సింగ్ సూర్జేవాలా, కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్, సిద్ధిరామయ్యల సమక్షంలో జగదీష్ షెట్టర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

Karnataka elections 2023: అభ్యర్థుల మూడో జాబితా విడుదల చేసిన కాంగ్రెస్

జగదీష్ షెట్టర్ కాంగ్రెస్ పార్టీలో చేరగానే డీకే శివకుమార్ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేయడానికి ‘బి’ఫారం అందజేశారు. జగదీష్ షెట్టర్ కుటుంబానికి జనసంఘ్ రోజుల నుంచి బీజేపీ పార్టీతో అనుబంధం ఉంది. బీజేపీలో ఉన్నప్పుడు మంత్రిగా, స్పీకర్ గా, ప్రతిపక్ష నేతగా, ముఖ్యమంత్రిగా పనిచేశారు. లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన షెట్టర్ కాంగ్రెస్ లో చేరడం బీజేపీకి పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పొచ్చు. కర్ణాటకలో దాదాపు 18శాతం మంది ఓటర్లు లింగాయత్ కమ్యూనిటీకి చెందిన వారు ఉన్నారు. సంప్రదాయబద్దంగా ఈ వర్గంలోని అధికశాతం మంది ఓటర్లు బీజేపీ మద్దతుదారులుగా పరిగణించబడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో షెట్టర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం బీజేపీ ఓటు బ్యాంకుకు గండి పడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

Karnataka Elections 2023 : కాంగ్రెస్‌లో చేరిన కర్ణాటక మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ్ సవాడీ

కాంగ్రెస్ పార్టీలో చేరిన తరువాత జగదీష్ షెట్టర్ మీడియాతో మాట్లాడారు. సీనియర్ నేతని కావడంవల్ల నాకు టికెట్ వస్తుందని అనుకున్నానని, కానీ రాలేదని తెలియగానే షాక్ కు గురయ్యానని చెప్పారు. ఎవరూ నాతో మాట్లాడలేదు, నన్ను ఒప్పించేందుకు ప్రయత్నంకూడా చేయలేదు. నాకు ఏ పదవి వస్తుందోనే విషయంలోకూడా హామీ ఇవ్వలేదని అని జగదీష్ షెట్టర్ అన్నారు. పార్టీ నుంచి నన్ను బలవంతంగా తొలగించారంటూ షెట్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. నేను కాంగ్రెస్ సిద్ధాంతాలు అంగీకరించి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు.

Karnataka Election: 23మంది అభ్యర్థులతో బీజేపీ రెండో జాబితా విడుదల.. జగదీష్ షెట్టర్‌కు దక్కని చోటు..

కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. షెట్టర్ ను వివాద రహిత వ్యక్తిగా అభివర్ణించారు. ఆయన చేరిక కాంగ్రెస్ పార్టీలో ఉత్సాహాన్ని నింపుతుందని చెప్పారు. షెట్టర్ ఎప్పుడూ బీజేపీతో పాటు ఉండే మర్యాదపూర్వక, లౌకిక రాజకీయ వేత్త అని సిద్ధిరామయ్య అన్నారు. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ప్రతిపక్ష నేత అని, బీజేపీలో నిజాయితీపరుడైన పార్టీ కార్యకర్త, ఎప్పుడూ ఆ పార్టీకి అండగా నిలిచారని సిద్ధిరామయ్య అన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడంతో పార్టీకి ఎంతో బలాన్నిస్తుందని చెప్పారు. ఇదిలాఉంటే 224 అసెంబ్లీ స్థానాలకుగాను బీజేపీ రెండు దఫాలుగా అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. మరో 12 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

 

ట్రెండింగ్ వార్తలు