Karnataka elections 2023: అభ్యర్థుల మూడో జాబితా విడుదల చేసిన కాంగ్రెస్
ఇందులో 43 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ్ సవాదీకి అథానీ నియోజక వర్గం నుంచి టికెట్ ఇచ్చింది.

Karnataka elections 2023
Karnataka elections 2023: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నెల 10న జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇవాళ తమ అభ్యర్థుల మూడో జాబితా విడుదల చేసింది. ఇందులో 43 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ్ సవాదీకి అథానీ నియోజక వర్గం నుంచి టికెట్ ఇచ్చింది. కొత్తూర్ మంజునాథ్ ని కోళార్ సీటు నుంచి బరిలోకి దింపుతోంది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka elections 2023) వేళ 61 మంది నేతలతో పరిశీలకులను నియమించింది కాంగ్రెస్. తెలంగాణ రాష్ట్రం నుంచి ఏఐసీసీ పరిశీలకులుగా నియమితమైవారిలో ఎమ్మెల్యే సీతక్క, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి, ఆదివాసీ జాతీయ ఉపాధ్యక్షుడు బెల్లయ్య నాయక్ కూడా ఉన్నారు.
కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. వారిలో ప్రస్తుతం 119 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్ కు 75, జేడీఎస్ కు 28 సీట్లు ఉన్నాయి. బీజేపీ కూడా ఇప్పటికే రెండో జాబితాను విడుదల చేసింది. ఆ పార్టీ తొలి విడత అభ్యర్థుల జాబితాలో మొత్తం 189 మంది అభ్యర్థుల పేర్లు ఉండగా, వారిలో 52 మంది కొత్త వారే ఉన్న విషయం తెలిసిందే. రెండో జాబితాలో 23 మంది అభ్యర్థులతో జాబితా విడుదల చేసింది.

Karnataka elections 2023
Karnataka Election: 23మంది అభ్యర్థులతో బీజేపీ రెండో జాబితా విడుదల.. జగదీష్ షెట్టర్‌కు దక్కని చోటు..