Virbhadra Singh : మాజీ సీఎంకి 2 నెలల్లో రెండోసారి కరోనా
హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్(86)కు రెండు నెలల్లో రెండవసారి కోవిడ్ పాజిటివ్ గా తేలింది.

Veerabhadra Singh
Virbhadra Singh హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్(86)కు రెండు నెలల్లో రెండవసారి కోవిడ్ పాజిటివ్ గా తేలింది. శుక్రవారం వీరభద్ర సింగ్ కి నిర్వహించిన కరోనా పరీక్షలో పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో సిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ (ఐజీఎంసీ) లో ట్రీట్మెంట్ కొనసాగిస్తున్నట్లు ఐజీఎంసీ సీనియర్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ జనక్ రాజ్ తెలిపారు.
కాగా,వీరభద్ర సింగ్‌కు ఈ ఏడాది ఏప్రిల్ 13న తొలిసారి కరోనా సోకింది. దీంతో మోహాలీలోని మ్యాక్స్ హాస్పిటల్ లో చేరి ట్రీట్మెంట్ పొంది కోలుకున్నారు. మే నెలలో సిమ్లా వచ్చిన ఆయన కోవిడ్ అనంతర సమస్యలతో బాధపడుతూ.. ఐజీఎంసీలో చేరారు. గత నెల రోజులుగా ఆసుపత్రిలో ఉంటున్న వీరభద్ర సింగ్‌తోపాటు ఆయనకు సపర్యలు చేస్తున్న నర్సుకు కూడా మూడు రోజుల క్రితం కరోనా సోకినట్లు ఆసుపత్రి అధికారులు వెల్లడించారు. వీరభద్ర సింగ్ మార్చి-3న దీన్ దయాల్ ఉపాధ్యాయ హాస్పిటల్ లో కరోనా వ్యాక్సిన్ తీసుకున్నట్లు తెలిపారు.