Kerala : మిస్ కేరళ విజేత, రన్నరప్ దుర్మరణం
మిస్ కేరళ విన్నర్, రన్నరప్ లు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఓ ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి...కారు ప్రమాదానికి గురి కావడంతో...వారు చనిపోయారని పోలీసులు వెల్లడిస్తున్నారు.

Kerala Accident
Former Miss Kerala : మిస్ కేరళ విన్నర్, రన్నరప్ లు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఓ ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి…కారు ప్రమాదానికి గురి కావడంతో…వారు చనిపోయారని పోలీసులు వెల్లడిస్తున్నారు. ఈ ఘటన ఎర్నాకుళం బైపాస్ లోని హాలిడే ఇన్ ముందు తెల్లవారుజామున చోటు చేసుకుంది. కారులో ప్రయాణిస్తున్నమరో ఇద్దరికి గాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Read More : Australia : కోవాగ్జిన్ టీకాకు గుర్తింపు.. ఆంక్షలు ఎత్తేసిన ఆస్ట్రేలియా!
2019 సంవత్సరంలో మిస్ కేరళగా అన్సీ కబీర్, రన్నరప్ గా అంజనా షాజన్ గా గెలుపొందారు. అన్సీ తిరువనంతపురం అట్టింగల్ లోని అలంకోడ్ కు చెందిన వారు కాగా…అంజనా స్వస్థలం త్రిసూర్. వీరితో పాటు మరో ఇద్దరు కారులో బయలుదేరారు. సోమవారం ఎర్నాకుళం బైపాస్ దగ్గరున్న హాలీడే ఇన్ ఎదుట ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి కారు ప్రమాదం గురైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు.
Read More : LPG Price : గ్యాస్ ధర పెరిగింది, ఆందోళనలో చిరు వ్యాపారులు!
స్పాట్ లోనే…అన్సీ కబీర్, అంజనాలు చనిపోయారని, గాయాలైన ఇద్దరినీ ఎర్నాకులం మెడికల్ సెంటర్ కు తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకోవడానికి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అన్సీ, అంజనా మృతదేహాలను మార్చురీకి తరలించారు.