Viral Video : బస్సు కింద పడి చావు.. బైకర్‌పై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డ మాజీప్రధాని కోడలు, అసలేం జరిగిందంటే..

ఈ కారు ఖరీదు ఎంతో నీకు తెలుసా? కోటి రూపాయల 50లక్షలు అంటూ ఆ బైకర్ పై కోపాన్ని ప్రదర్శించారామె. అంతేకాదు అసభ్య పదజాలం కూడా ప్రయోగించారు.

Viral Video : బస్సు కింద పడి చావు.. బైకర్‌పై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డ మాజీప్రధాని కోడలు, అసలేం జరిగిందంటే..

Deve Gowda Daughter-in-law

మాజీ ప్రధాని దేవెగౌడ కోడలు వివాదంలో చిక్కుకున్నారు. ఓ వ్యక్తిని ఉద్దేశించి ఆమె వాడిన పదజాలం కాంట్రవర్సీకి కారణమైంది. బస్సు కింద పడి చావు అంటూ ఓ వ్యక్తిపై నోరు పారేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. అసలేం జరిగిందంటే..

మాజీ ప్రధాని దేవెగౌడ కోడలు, జేడీఎస్ నేత భవానీ రేవణ్ణ ప్రయాణిస్తున్న కారుని ఓ బైకర్ వచ్చి ఢీకొట్టాడు. దాంతో ఆ బైకర్ పై ఆమె తీవ్రంగా మండిపడ్డారు. బస్సు కింద పడి చావు అంటూ కోపంతో ఊగిపోయారు. బైకర్ పై ఆమె అలా సీరియస్ కావడానికి కారణం లేకపోలేదు. ఆ కారు చాలా ఖరీదైనది. దాని విలువ కోటి రూపాయల 50లక్షలు. అంత ఖరీదైన కారుని బైక్ వచ్చి గుద్దడంతో ఆమె కోపానికి గురయ్యారు. ఈ ఘటనలో కారు ముందు భాగంలో కొంత డ్యామేజ్ అయ్యింది. అది చూసి ఆమె తట్టుకోలేకపోయారు. ఇంత ఖరీదైన కారుని బైక్ తో గుద్ది డ్యామేజ్ చేశావు అంటూ బైకర్ పై శివాలెత్తారు.

Also Read : టీ20 లీగ్​లో వింత ఘటన.. ఇంత‌టి దుర‌దృష్ట‌వంతుడు మ‌రొక‌రు ఉండరేమో..!

భవానీ రేవణ్ణ తన ఖరీదైన కారులో(Toyota Vellfire) ప్రయాణం చేస్తున్నారు. బెంగళూరుకు 400 కిలోమీటర్ల దూరంలో ఉడిపిలోని సాలిగ్రామలో ఆమె జర్నీ చేస్తున్నారు. ఈ క్రమంలో రోడ్డుపై వెళ్తుండగా.. ఓ బైకర్ వచ్చి ఢీకొట్టాడు. వాహనాన్ని ఓవర్ టేక్ చేసే క్రమంలో ఆ బైకర్ రాంగ్ సైడ్ లో వచ్చి కారుని గుద్దేశాడు. ఈ ఘటనలో కారు ముందుభాగంలో కొంత డ్యామేజీ జరిగింది. దీంతో ఆమె చెలరేగిపోయారు. ఆ బైకర్ ను తిట్టిపోశారు. నువ్వు చావాలని అనుకుంటే పోయి బస్సు కింద పడి చావు. రాంగ్ సైడ్ ఎందుకు డ్రైవ్ చేస్తున్నావు? అంటూ బైకర్ పై తీవ్రంగా మండిపడ్డారు.

ఈ కారు ఖరీదు ఎంతో నీకు తెలుసా? కోటి రూపాయల 50లక్షలు అంటూ ఆ బైకర్ పై కోపాన్ని ప్రదర్శించారామె. అంతేకాదు అసభ్య పదజాలం కూడా ప్రయోగించారు. రోడ్డుపై నిల్చున్న ఓ వ్యక్తి ఆమెకు సర్ది చెప్పే ప్రయత్నం చేయగా.. ఆ వ్యక్తిపై రేవణ్ణ నిప్పులు చెరిగారు. కారు రిపేరీకి 50లక్షలు అవుతాయి. ఆ డబ్బు నువ్వు ఇస్తావా? అంటూ ఆ వ్యక్తిపై సీరియస్ అయ్యారు. దాంతో ఆ వ్యక్తి మౌనంగా ఉండిపోయాడు.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మాజీ ప్రధాని దేవెగౌడ కోడలి తీరు వివాదానికి దారితీసింది. నెటిజన్లు ఆమె తీరుపై మండిపడుతున్నారు. ఆ బైకర్ తో అలా మాట్లాడటం కరెక్ట్ కాదంటున్నారు. ఈ కారు ఖరీదు ఎంతో తెలుసా? అక్షరాల కోటి 50లక్షల రూపాయలు అంటూ పదే పదే అనడాన్ని తప్పుపట్టారు. ఆమె మాటలు ఆమె డబ్బు అహంకారానికి నిదర్శనం అంటూ కోప్పడ్డారు. అయితే కొందరు నెటిజన్లు భవానీ రేవణ్ణను సపోర్ట్ చేశారు. ఆమె అలా రియాక్ట్ అవ్వడంలో తప్పేదేమీ లేదంటున్నారు. బైకర్ రాంగ్ రూట్ లో రావడాన్ని వారు తప్పుపట్టారు. అతడు రాంగ్ రూట్ లో రావడం వల్లే ఈ ఘటన జరిగిందన్నారు.

Also Read : 2023 ఏడాదిలో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాలు ఏంటో తెలుసా?

భవానీ రేవణ్ణ భర్త హెచ్ డీ రేవణ్ణ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక ఆమె ఇద్దరు కొడుకులు ప్రజ్వల్, సురాజ్ రేవణ్ణ ఒకరు ఎంపీ కాగా, మరొకరు ఎమ్మెల్సీగా ఉన్నారు.