సోనియా గాంధీపై మాజీ సైనికుడు సురేంద్ర పూనియా పోటీ
కాంగ్రెస్ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీపై పోటీకి మాజీ సైనికుడు మేజర్ సురేంద్ర పూనియా సిద్ధమయ్యాడు.

కాంగ్రెస్ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీపై పోటీకి మాజీ సైనికుడు మేజర్ సురేంద్ర పూనియా సిద్ధమయ్యాడు.
ఢిల్లీ : కాంగ్రెస్ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీపై పోటీకి మాజీ సైనికుడు సిద్ధమయ్యాడు. రాయ్‌బరేలి లోక్‌సభ స్థానం నుంచి మాజీ సైనికుడు మేజర్ సురేంద్ర పూనియా పోటీ చేస్తున్నారు. 2004 నుంచి ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలి లోక్‌సభ స్థానం నుంచి వరుసగా నాలుగుసార్లు ఎన్నికైన కాంగ్రెస్ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీకి పోటీగా గట్టి నాయకుడిని బరిలో నిలపాలని బీజేపీ భావించింది. తదనుగుణంగా మోడీ నాయకత్వానికి ఆకర్షితులై పార్టీలో చేరిన మాజీ సైనికుడు మేజర్ సురేంద్ర పూనియాను రంగంలోకి దించింది.
‘సోనియాపై పోటీ చేయమని మోడీజీ నన్ను కోరడాన్ని నేను గౌరవంగా భావిస్తున్నాను. ఒక నాయకుడిగా జాతీయవాదం, జాతీయ భద్రతా బలగాలపై ఆయనకు అమితమైన గౌరవం ఉంది. ఎప్పుడూ పేదప్రజల కోసమే పనిచేశారు. అందుకే నేను బీజేపీలో చేరాను. ఆయన నాకు అప్పగించిన ఈ పనిని నేను తప్పక నెరవేరుస్తాను. ఇది చౌకీదార్‌లకి, చోరులకి మధ్య జరుగుతున్న పోరాటం’ అని మేజర్ పూనియా అన్నారు.
సైనిక విధుల్లో ఉన్నప్పుడు ఆయన కనబరిచిన అసాధారణ ప్రతిభకు విశిష్ట సేవా పురస్కారాన్ని కూడా అందుకున్నారు. మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ బీజేపీలో చేరిన మరునాడే పూనియా కూడా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 2014 ఎన్నికల్లో రాజస్థాన్‌లోని సికార్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి పూనియా ఓటమి పాలయ్యారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో సోనియాగాంధీపై పోటీకి సిద్ధమయ్యారు.