Modi 9 Years Govt : తొమ్మిదేళ్ల బీజేపీ పాలనలో ఆకలి, దరిద్రం, నిరుద్యోగం మాత్రమే కనిపిస్తున్నాయ్ : చింతా మోహన్

ఒడిశా బలాసోర్ రైలు ప్రమాదంలో వెయ్యికిపైగా మరణాలు సంభవించాయి. ఇవన్నీ బయటకు రాకుండా మీడియాను కేంద్ర ప్రభుత్వం మేనేజ్ చేసింది. మృతదేహాలను కూడా బయటకు కనిపించకుండా రాత్రికి రాత్రికి ట్రక్కుల్లో తరలించేసి అడవుల్లో దహనం చేశారు.

Modi 9 Years Govt : తొమ్మిదేళ్ల బీజేపీ పాలనలో ఆకలి, దరిద్రం, నిరుద్యోగం మాత్రమే కనిపిస్తున్నాయ్ : చింతా మోహన్

Chinta Mohan

Chinta Mohan criticizes: తొమ్మిదేళ్ల బీజేపీ పాలనపై పార్టీ పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. బీజేపీ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి జరిగిందని దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు బీజేపీ నేతలు. దీనిపై మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ నేతల చింతా మోహన్ విరుచుకుపడ్డారు. బీజేపీ పాలనపై ఘాటు విమర్శలు చేశారు. తొమ్మిదేళ్లలో బీజేపీ విజయాలు సాధించింది అంటూ అమిత్ షా ,జెపి నడ్డా గొప్పగా చెబుతున్నారు కానీ…ఈ తొమ్మిదేళ్లలో బీజేపీ సాధించింది అభివృద్ధి కాదు ఆకలి..పేదరికం మాత్రమే అంటూ విమర్శించారు. పేదలకు బిజెపి చేసింది ఏమి లేదుగానీ …దానికి ప్రతిఫలంగా దేశంలో ఆకలి దరిద్రం..నిరుద్యోగం కనిపిస్తోంది అంటూ విమర్శలు సంధించారు.

Minister Senthil Balaji : ఈడీ అరెస్టుతో భోరున ఏడ్చిన తమిళనాడు మంత్రి ..

ఈ సందర్భంగా చింతా మోహన్ ఒడిశా రైళ్ల ప్రమాదంపై కూడా ఘాటుగా స్పందించారు.బలాసోర్ రైలు ప్రమాదంలో వలస కూలీలు చనిపోయారు ..ఇంకా ఎన్నో దారుణ మరణాలు సంభవించాయి. కానీ ఇవన్నీ బయటకు రాకుండా మీడియాను కేంద్ర ప్రభుత్వం మేనేజ్ చేసింది అంటూ ఆరోపించారు. బలాసోర్ రైలు ప్రమాదంలో చనిపోయింది వెయ్యిమంది పైగా అని కానీ మరణాల సంఖ్యలు తగ్గించి చెప్పారని కనీసం మృతదేహాలను కూడా బయటకు కనిపించకుండా రాత్రికి రాత్రికి ట్రక్కుల్లో తరలించేసి అడవుల్లో దహనం చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు.

CM Jagan Govt : జగన్ నాలుగేళ్ల పాలనలో హత్యలు, ఆత్మహత్యలు, జైళ్లు, బెయిళ్లు : చింతా మోహన్

ఈ ప్రమాదంలో చనిపోయినవారిలో ఎక్కువమంది ఎస్సిలు,ఎస్టీలు పేదలు ఉన్నారని వారి గురించి పట్టించుకునే నాథుడే లేకపోయారు అంటూ ఆవేదన వ్యక్తంచేశారు. ఈ ప్రమాదంలో మతదేహాలు వంకాయ బజ్జిల్లా కాలిపోయాయని అన్నారు. వంద కోట్లమంది ఉన్న ఎస్సి ఎస్టీ,ఓబీసీ,మైనారిటీలకు 9 ఏళ్లలోబీజేపీ ఏం చేసింది ? అని ప్రశ్నించారు. మోడీ ప్రభుత్వ అవినీతి అందరికి కనపడుతుందని కానీ వాటిని కప్పి పుచ్చి మాయ చేయటానికి షా, నడ్డాల్లాంటి నేతలు యత్నిస్తున్నారని అన్నారు. ఎల్ఐసి నుంచి 12 లక్షల కోట్లు అదానికి ఎలా ఇచ్చారు? అంటూ ప్రశ్నించారు.