Omicron BA4, BA5 : మహారాష్ట్రలో ఒమిక్రాన్‌ టెన్షన్‌.. తొలిసారి బీఏ.4, బీఏ.5 కేసులు

వీరంతా పుణెకు చెందినవారని.. వారందరినీ హోం ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. జీనోమ్ సీక్వెన్సింగ్‌ ద్వారా.. మహారాష్ట్ర వైద్యులు ఒమిక్రాన్‌ కేసులుగా గుర్తించారు.

Omicron BA4, BA5 : మహారాష్ట్రలో ఒమిక్రాన్‌ టెన్షన్‌.. తొలిసారి బీఏ.4, బీఏ.5 కేసులు

Omicron Ba4,ba5

Updated On : May 29, 2022 / 2:16 PM IST

Omicron BA4 and BA5 : మహారాష్ట్రను మరోసారి కరోనా టెన్షన్‌ పెడుతోంది. దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న వేళ.. ప్రమాదకరమైన ఒమిక్రాన్‌ ఉపవేరియంట్లు వెలుగుచూడటం కలకలం రేపుతోంది. మహారాష్ట్రలో తొలిసారి బీఏ.4, బీఏ.5 కేసులు బయటపడటం ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్రలో తాజాగా నాలుగు బీఏ.4 కేసులు, మూడు బీఏ.5 కేసులు నమోదైనట్టు అక్కడి వైద్యులు ప్రకటించారు. ఒమిక్రాన్‌ ఉపవేరియంట్ల బారిన పడిన ఏడుగురికీ స్వల్ప లక్షణాలే ఉన్నట్లు తెలిపారు.

వీరంతా పుణెకు చెందినవారని.. వారందరినీ హోం ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. జీనోమ్ సీక్వెన్సింగ్‌ ద్వారా.. మహారాష్ట్ర వైద్యులు ఒమిక్రాన్‌ కేసులుగా గుర్తించారు. పుణెకు చెందిన ఏడుగురిపై జీనోమ్ సీక్వెన్సింగ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్ నిర్వహించిందని.. ఈ సీక్వెన్సింగ్‌ను ఫరీదాబాద్‌లోని ఇండియన్‌ బయోలాజికల్‌ డేటా సెంటర్ ధ్రువీకరించిందని డాక్టర్లు చెబుతున్నారు. ఏడుగురిలో ముగ్గురు మహిళలతో పాటు.. తొమ్మిదేళ్ల బాలుడు కూడా ఉన్నాడు.

Omicron : ఎలుకల నుంచి మనుషులకు ఒమిక్రాన్ వ్యాప్తి?

వైరస్‌ బారిన పడినవారిలో ఇద్దరు విదేశాలకు వెళ్లివచ్చారని.. మరో ముగ్గురు ఇతర రాష్ట్రాలకు ప్రయాణించినట్లు గుర్తించారు. మరో ఇద్దరు మాత్రం ఎక్కడికీ వెళ్లలేదని.. బాలుడు మినహా మిగతా ఆరుగురు కూడా వ్యాక్సినేషన్‌ పూర్తిస్థాయిలో తీసుకున్నారని చెప్పారు. ఓ వ్యక్తి బూస్టర్‌ డోసు కూడా తీసుకున్నట్లు తేలింది.