Free Foodgrain Scheme: రేషన్ కార్డుదారులకు కేంద్రం తీపి కబురు.. ఉచిత బియ్యం పంపిణీ మరో ఏడాది పొడిగింపు

పేదలకు అందిస్తున్న ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ పథకాన్ని మరో ఏడాది పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్రం శుక్రవారం వెల్లడించింది.

Free Foodgrain Scheme: రేషన్ కార్డుదారులకు కేంద్రం తీపి కబురు.. ఉచిత బియ్యం పంపిణీ మరో ఏడాది పొడిగింపు

Updated On : December 23, 2022 / 10:00 PM IST

Free Foodgrain Scheme: దేశంలోని పేదలకు కేంద్రం కొత్త సంవత్సర కానుకగా తీపి కబురు చెప్పింది. పేదలకు అందిస్తున్న ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ పథకాన్ని మరో ఏడాది పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ శుక్రవారం వెల్లడించారు.

Kamal Haasan: ‘భారత్ జోడో యాత్ర’లో చేరనున్న కమల్ హాసన్.. ఢిల్లీలో రాహుల్‌తో కలిసి పాదయాత్ర

జాతీయ ఆహార భద్రతా పథకం కింద బియ్యం, గోధుమలు వంటి ఆహార ధాన్యాన్ని మరో ఏడాది ఉచితంగా ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. 2020లో కోవిడ్ సోకిన సమయంలో పేదలకు ఆహారానికి కొరత ఉండకూడదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ‘ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన’ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని ప్రకారం ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా అందించే బియ్యం, గోధుమల్ని ఉచితంగా ఇస్తోంది. అంతకుముందు సబ్సిడీ రేట్ల మీద అందించే వీటిని 2020 నుంచి ఉచితంగా ఇస్తోంది. ఈ పథకం ఈ నెలతో పూర్తవ్వాలి. అయితే, వచ్చే దీన్ని వచ్చే ఏడాది డిసెంబర్ వరకు పొడిగిస్తున్నట్లు పీయూష్ గోయల్ వెల్లడించారు. ఈ ఉచిత పథకం వల్ల కేంద్ర ప్రభుత్వంపై ప్రతి సంవత్సరం రూ.2 లక్షల కోట్ల భారం పడుతుంది.

జాతీయ ఆహార భద్రత పథకం కింద కేంద్రం బియ్యం కిలో రూ.3కు, గోధుమలు రూ.2కు ఇవ్వాలి. అయితే, ‘ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన’ పథకం కింది ఉచితంగా ఇస్తోంది. ఈ రెండు పథకాల్ని కలిపి ఉచితంగా ఇస్తున్నట్లు పీయూష్ చెప్పారు.