ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు 5వేలు ఆర్థికసాయం..రెండు నెలలు ఫ్రీ రేషన్ : కేజ్రీవాల్
కరోనా విజృంభణ,లాక్ డౌన్ నేపథ్యంలో ఉపాధి కోల్పోయి ఇబ్బందులెదుర్కొంటున్న పేదలకు ఆర్థిక తోడ్పాటు

Free Ration For 2 Months To 72 Lakh People Rs 5000 Financial Aid To Auto Driverstaxi Drivers Delhi Cm Kejriwal
Kejriwal కరోనా విజృంభణ,లాక్ డౌన్ నేపథ్యంలో ఉపాధి కోల్పోయి ఇబ్బందులెదుర్కొంటున్న పేదలకు ఆర్థిక తోడ్పాటు అందించాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. ఢిల్లీలోని ఆటోవాలాలు, ట్యాక్సీ వాలాలకు రూ.5000 చొప్పున వారి వారి అకౌంట్లలో వేయనున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం ప్రకటించారు.
అదేవిధంగా,ఢిల్లీలోని రేషన్‌కార్డుదారులందరికీ రాబోయే 2 నెలలపాటు ఉచిత రేషన్ అందించనున్నట్లు కేజ్రీవాల్ ప్రకటించారు. దీనివల్ల మొత్తం 72 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని తెలిపారు. అయితే రెండు నెలలపాటు ఉచిత రేషన్ అందిస్తున్నంత మాత్రాన రెండు నెలలపాటు లాక్‌డౌన్ కొనసాగుతుందని భావించవద్దని ఆయన స్పష్టం చేశారు. లాక్‌డౌన్‌తో సంబంధం లేకుండా రేషన్ ఉచితంగా అందజేస్తామని, ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్న పేదలకు సాయం చేయాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని కేజ్రీవాల్ స్పష్టం చేశారు.
కాగా, కోవిడ్ కారణంగా ఢిల్లీ ప్రభుత్వం గత ఏడాది కూడా 1.56 లక్షల మందిఆటో, టాక్సీ డ్రైవర్లకు 5 వేలు, నిర్మాణ రంగంలో ఉన్న కార్మికులకు 10 వేల ఆర్ధిక సాయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక, ఢిల్లీలో కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఢిల్లీలో ఈ నెల 10 వరకు లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. తొలుత వారం రోజుల పాటు లాక్‌డౌన్ విధించగా..మహమ్మారి తగ్గుముఖం పట్టకపోవడంతో పొడిగిస్తూ వస్తున్నారు. లాక్‌డౌన్ మొదలై రెండు వారాలు గడిచిపోగా..మూడో వారంలోకి ప్రవేశించింది.