ఢిల్లీలో ఉద్రిక్తత : బారికేడ్లను తొలగించి..దూసుకెళ్లిన జేఎన్‌యూ స్టూడెంట్స్

  • Published By: madhu ,Published On : November 18, 2019 / 07:36 AM IST
ఢిల్లీలో ఉద్రిక్తత : బారికేడ్లను తొలగించి..దూసుకెళ్లిన జేఎన్‌యూ స్టూడెంట్స్

Updated On : November 18, 2019 / 7:36 AM IST

దేశ రాజధానిలో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. జేఎన్‌యూ విద్యార్థులు చేపట్టిన లాంగ్ మార్చ్‌ను పోలీసులు మార్గమధ్యంలోనే అడ్డుకున్నారు. వీరు పార్లమెంట్‌కు వెళ్లకుండా మొదట ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించి..దూసుకొచ్చారు. వీరిని నిలువరించేందుకు పోలీసుల ప్రయత్నాలు విఫలమయ్యాయి. భద్రతలో భాగంగా ఏర్పాటు చేసిన రెండో బారికేడ్లను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు. 

భారీగా మోహరించిన పోలీసులు, విద్యార్థుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో విద్యార్థులకు గాయాలయ్యాయి. పోలీసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. ఆందోళన చేపడుతున్న విద్యార్థులను ఒక్కొక్కరిని బలవంతంగా ఈడ్చుకుంటూ వ్యాన్‌లలో పడేస్తున్నారు. తాము శాంతియుతంగా ఆందోళన చేస్తున్నా..విద్యార్థిని, విద్యార్థులు వెల్లడిస్తున్నారు. తమకు రాతపూర్వకంగా హామీనివ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. 

దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) ప్రాంగణంలో మరోసారి విద్యార్థుల ఆందోళనతో అట్టుడుకుతోంది. హాస్టల్ ఫీజులను భారీగా పెంచడమే కాకుండా..నిబంధనలను కూడా కఠినతరం చేశారంటూ..విద్యార్థులు ఆందోళన చేపడుతున్నారు. ఈ క్రమంలో 2019, నవంబర్ 18వ తేదీ సోమవారం చలో పార్లమెంట్‌కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో పార్లమెంట్ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. జేఎన్‌యూలో విద్యార్థుల సమస్యలు పరిష్కరించేందుకు ముగ్గురు సభ్యులతో ఉన్నతస్థాయి కమిటీని నియమించింది కేంద్రం. 
Read More : పార్లమెంట్ వద్ద 144 సెక్షన్ : జెన్‌యూ విద్యార్థుల లాంగ్ మార్చ్