G20 Summit 2023: న్యూ ఢిల్లీలో ముగిసిన సదస్సు.. జీ20 అధ్యక్ష బాధ్యతలు ఇక బ్రెజిల్‌కి.. Live Update

జీ20 సదస్సు ముగిసింది. దీనిపై భారత్ అధికారికంగా ప్రకటన చేసింది.

G20 Summit 2023: న్యూ ఢిల్లీలో ముగిసిన సదస్సు.. జీ20 అధ్యక్ష బాధ్యతలు ఇక బ్రెజిల్‌కి.. Live Update

G20 Summit 2023

జీ20 సదస్సు ముగిసింది. ఇవాళ ఉదయం రాజ్ ఘాట్ వద్ద మహాత్మాగాంధీకి G20 దేశాధినేతలు నివాళులర్పించారు.

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 10 Sep 2023 03:11 PM (IST)

    బ్రెజిల్‌కు జీ20 అధ్యక్ష బాధ్యతలు

    G20 Summit 2023

    జీ20 సదస్సు ముగిసింది. జీ20 అధ్యక్షతను భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వాకు అందించారు. న్యూ ఢిల్లీలో జీ20 సదస్సు ముగిసిందని మోదీ అధికారికంగా ప్రకటించారు.

  • 10 Sep 2023 11:36 AM (IST)

    మధ్యాహ్నం పలు దేశాధినేతలతో ప్రధాని నరేంద్ర మోదీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రోన్‌కు ప్రధాని మోదీ వర్కింగ్ లంచ్ అనంతరం విడిగా కెనడా దేశాధినేతతో సమావేశం అవుతారు. ఆ తర్వాత కొమొరోస్, తుర్కియే (టర్కీ), యూఏఈ, దక్షిణ కొరియా, యురోపియన్ యూనియన్, బ్రెజిల్, నైజీరియా అధినేతలతో మోడీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. కీలక అంశాలపై రంగాల వారీగా ఆయా దేశాలతో భారత్ పలు ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది.

  • 10 Sep 2023 11:34 AM (IST)

    వచ్చే ఏడాదికి G21 ప్రెసిడెన్సీ‌ని భారత్ బ్రెజిల్‌కి అప్పగించనుంది.

  • 10 Sep 2023 11:32 AM (IST)

    రెండోరోజు జీ20 శిఖరాగ్ర సమావేశాలు మొదలయ్యాయి. ఉదయం రాజ్ ఘాట్ వద్ద మహాత్మాగాంధీ స్మృతికి G20 దేశాధినేతలు నివాళులర్పించారు. మధ్యాహ్నం 12:30 వరకు భారత మండపంలో ‘ఒకే భవిష్యత్’ అంశం పై చర్చలు
    జరగనున్నాయి.

  • 10 Sep 2023 11:31 AM (IST)