ముఖ్తార్ అన్సారీ అంత్యక్రియలకు భారీ ఎత్తున జనం.. ఘాజీపూర్‌లో పటిష్ట భద్రత

ఉత్తరప్రదేశ్ గ్యాంగ్‌స్టర్‌, రాజకీయ నాయకుడు ముఖ్తార్ అన్సారీ అంత్యక్రియలకు భారీ ఎత్తున జనం హాజరయ్యారు.

ముఖ్తార్ అన్సారీ అంత్యక్రియలకు భారీ ఎత్తున జనం.. ఘాజీపూర్‌లో పటిష్ట భద్రత

Mukhtar Ansari funerals: ఉత్తరప్రదేశ్ గ్యాంగ్‌స్టర్‌, రాజకీయ నాయకుడు ముఖ్తార్ అన్సారీ అంత్యక్రియలకు భారీ ఎత్తున జనం హాజరయ్యారు. ఘాజీపూర్‌లో ఈరోజు పటిష్ట భద్రత మధ్య అన్సారీ అంత్యక్రియలు జరిగాయి. గుండెపోటుతో ఆయన గురువారం చనిపోయారు. బండా జిల్లాలోని రాణి దుర్గావతి మెడికల్ కాలేజీలో పోస్ట్‌మార్టం పరీక్ష పూర్తయిన తర్వాత అన్సారీ మృతదేహాన్ని పటిష్ట భద్రత నడుమ ఆయన స్వస్థలమైన ఘాజీపూర్‌కు తీసుకువచ్చారు.

మిస్టర్ అన్సారీ మృతదేహాన్ని తీసుకువెళ్లే అంబులెన్స్‌తో పాటు 24 పోలీసు వాహనాలతో కూడిన 26 వాహనాల భారీ కాన్వాయ్ ప్రయాగ్‌రాజ్, భదోహి, కౌశాంబి, వారణాసి జిల్లాల గుండా ఘాజీపూర్ చేరుకుంది. అన్సారీ కుమారులు ఉమర్ అన్సారీ, అబ్బాస్ అన్సారీ, భార్య, ఇద్దరు బంధువులు అంబులెన్స్ లోపల ఉన్నారు. అత్యంత వివాదాస్పద నాయకుడైన అన్సారీ గతాన్ని దృష్టిలో పెట్టుకుని యూపీ ప్రభుత్వం గట్టి భద్రతా చర్యలు చేపట్టింది.

మొహమ్మదాబాద్ కాలీ బాగ్‌లోని శ్మశానవాటికలో అన్సారీ అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియల నేపథ్యంలో ఘాజీపూర్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అన్సారీ అంత్యక్రియలు ప్రశాంతంగా ముగిశాయని ఆయన సోదరుడు అఫ్జల్ తెలిపారు.

Also Read: సునీతా కేజ్రీవాల్ మరో రబ్రీదేవి కాబోతున్నారా? పార్టీని, ఢిల్లీ పీఠాన్ని నడిపించే నారీ శక్తి ఆమేనా?

అన్సారీ మృతిపై కుటుంబ సభ్యుల అనుమానాలు
అన్సారీది సాధారణ మరణం కాదని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపించారు. జైలులో ఉన్న సమయంలో ఆయన “స్లో పాయిజనింగ్”కు గురయ్యాడని, దాని వల్లే చనిపోయాడని అన్నారు. ఆయన మృతి గురించి తమకు నేరుగా సమాచారం ఇవ్వలేదని, మీడియా ద్వారా తెలుసుకున్నామని చెప్పారు. రాణి దుర్గావతి వైద్య కళాశాలలో ఐదుగురు వైద్యుల బృందం నిర్వహించిన పోస్ట్‌మార్టం పరీక్షలో అన్సారీ (68) గుండెపోటుతో మరణించినట్లు నిర్ధారణ అయిందని పీటీఐ వెల్లడించింది. కాగా, మృతిపై విచారణ జరిపించాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి, భీమ్ ఆర్మీ ఫౌండర్ చంద్రశేఖర్ ఆజాద్ డిమాండ్ చేశారు.

Also Read: 1823 కోట్ల రూపాయల రికవరీకి కాంగ్రెస్‌ పార్టీకి ఆదాయ పన్నుశాఖ నోటీసు