సునీతా కేజ్రీవాల్ మరో రబ్రీదేవి కాబోతున్నారా? పార్టీని, ఢిల్లీ పీఠాన్ని నడిపించే నారీ శక్తి ఆమేనా?

Sunita Kejriwal: జువాలజీలో మాస్టర్స్ డిగ్రీ చేసిన ఆమె కేజ్రీవాల్ లాగే IRS ఉద్యోగి. 1994 బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ ఆఫీసర్‌ ఆమె.

సునీతా కేజ్రీవాల్ మరో రబ్రీదేవి కాబోతున్నారా? పార్టీని, ఢిల్లీ పీఠాన్ని నడిపించే నారీ శక్తి ఆమేనా?

Sunita KejriwalSunita Kejriwal

సునీతా కేజ్రీవాల్… లిక్కర్ స్కాంలో కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత ఈ పేరు బాగా తెరమీదకు వచ్చింది. అంతకముందు సునీత కేజ్రీవాల్ సతీమణి అని తెలిసినా.. ఆమె సెంట్రిక్‌గా పెద్దగా చర్చ జరగలేదు. కానీ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసిన తర్వాత ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చేశారు సునీతా కేజ్రీవాల్. మోదీ టార్గెట్‌గా విమర్శలు చేస్తూ.. ప్రజల్లో సెంటిమెంట్ రగిల్చేలా ట్వీట్లు, ప్రకటన చేస్తూ వస్తున్నారామె.

జైల్లో ఉన్నా, బయట ఉన్నా తన భర్త జీవితం దేశానికే అంకితమని స్టేట్‌మెంట్ ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించారు సునీతా కేజ్రీవాల్. ఇది ఢిల్లీ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం చేసిన ద్రోహమని ప్రజల సెంటిమెంట్‌ను టచ్ చేశారు. ఇలాంటి స్టేట్‌మెంట్లతో డైలమాలో ఉన్న ఆప్ క్యాడర్‌కు జోష్ నింపేందుకు ట్రై చేశారు. సేమ్‌టైమ్ దేశవ్యాప్తంగా సునీత కేజ్రీవాల్ పబ్లిక్ పర్సనాలిటీగా అయిపోయారు. ఆమె ఇక కేజ్రీవాల్ స్థానంలో బాధ్యతలు తీసుకోబోతున్నారని.. అటు పార్టీని, ఇటు ఢిల్లీ ప్రభుత్వాన్ని సునీతా కేజ్రీవాలే నడపబోతున్నారని చర్చ జరుగుతోంది.

అర్హతలు ఉన్నాయా?
ఇంతకి సునీతా కేజ్రీవాల్‌కు.. పార్టీని, ప్రభుత్వాన్ని నడిపే అర్హతలు ఉన్నాయా అనే దానిపై కూడా చర్చ ఉంది. సునీతా కేజ్రీవాల్ ఉన్నత చదువులు చదువుకున్నారు. జువాలజీలో మాస్టర్స్ డిగ్రీ చేసిన ఆమె కేజ్రీవాల్ లాగే IRS ఉద్యోగి. 1994 బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ ఆఫీసర్‌ ఆమె. 22 సంవత్సరాల పాటు ఆదాయపు పన్నుశాఖలో వివిధ హోదాల్లో పనిచేసిన సునీతా కేజ్రీవాల్.. 2016లో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. చివరిసారిగా ఢిల్లీలోని ఆదాయపు పన్ను అప్పిలేట్ ట్రైబ్యునల్‌లో ఐటీ కమిషనర్‌గా పనిచేశారు.

సివిల్ సర్వీసెస్ ట్రైనింగ్ సమయంలోనే ఆమెకు కేజ్రీవాల్‌తో పరిచయం ఏర్పడింది. అక్కడే తనని మొదటిసారి చూశారు సునీతా. ఇద్దరి స్నేహం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాక ఇంట్లో చెప్పి పెద్దలను ఒప్పించి 1994 నవంబర్‌లో కేజ్రీవాల్, సునీత వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత 1995లో ఐఆర్ఎస్ శిక్షణ పూర్తి చేసి ఉద్యోగాల్లో చేరారు.

అప్పటినుంచి భర్తకు అండగా..
2016లో వాలంటరీ రిటైర్మెంట్‌ తీసుకున్న ఈ లేడీ కేజ్రీవాల్‌.. అప్పటినుంచి తన భర్తకు అండగా నిలుస్తూ వస్తున్నారు. 2020 ఎన్నికల్లో కేజ్రీవాల్‌ మూడోసారి ఢిల్లీ సీఎం పీఠాన్ని అధిష్టించడంలో కీలక పాత్ర పోషించారు సునీత. ఆ సమయంలో ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నారామె. పంజాబ్‌ సీఎం అభ్యర్థి భగవంత్‌మాన్‌కు మద్దతుగా కూడా ప్రచారంలో పాల్గొన్నారు. అంతకముందు ఉద్యగం చేస్తూ ఇండియా ఎగైనెస్ట్ కరప్షన్ ఉద్యమం, ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పాటులో తనవంతు పాత్ర పోషించారు.

ఆప్‌లో ప్రత్యక్షంగా, పరోక్షంగా కీలకపాత్ర పోషిస్తున్న సునీతా కేజ్రీవాల్ సీఎం పదవికి అర్హులని అంటున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు. విద్యావంతురాలిగా, కేజ్రీవాల్‌ సతీమణిగా ఆమెకు అన్ని అర్హతలు ఉన్నాయని చెప్తున్నారు. ఢిల్లీ ప్రజల్లోనూ సునీతా కేజ్రీవాల్‌కు మంచి ఆదరణ ఉందంటున్నారు ఆప్ నేతలు.

మామూలుగా అయితే సీఎం కుటుంబసభ్యులు అధికార బలంతో నానా హంగామా చేస్తుంటారు. అధికార దర్పం ప్రదర్శిస్తుంటారు. కానీ సునీతా కేజ్రీవాల్ మాత్రం సింప్లిసిటీకి మారుపేరుగా ఉంటారు. తన భర్త మూడుసార్లు వరుసగా సీఎం అయినా ఎక్కడా హడావుడి లేకుండా సాదాసీదాగా, ప్రజా సేవకురాలిగా వ్యవహరిస్తుంటారు. ఈ వ్యవహార శైలినే ఆమెను ఢిల్లీ ప్రజలకు దగ్గర చేసిందని చెప్పుకోవచ్చు.

ప్రస్తుత పరిస్థితుల్లో కేజ్రీవాల్ తర్వాత ప్రత్యామ్నాయంగా సునీతా కేజ్రీవాలే కనిపిస్తున్నారు. కేజ్రీవాల్ సన్నిహితులుగా ప్రభుత్వంలో ఉన్న కీలక నేతలంతా అవినీతి, ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మనీష్ సిసోడియా, సత్యేంద్రజైన్ లాంటి చెప్పుకోదగ్గ నేతలంతా జైలులో ఉన్నారు. సో ఇప్పుడు సునీతా కేజ్రీవాలే ఢిల్లీ ప్రభుత్వాన్ని, పార్టీని నడపగలరని భావిస్తున్నారు ఆప్ నేతలు.

అడ్డంకులు?
అయితే సునీతాకేజ్రీవాల్‌ కూడా ఢిల్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టకుండా అడ్డంకులు ఏర్పడే అవకాశం ఉంది. ఈ మధ్యే సునితా కేజ్రీవాల్‌కు నోటీసులు ఇచ్చింది ఢిల్లీ కోర్టు. రెండుచోట్ల ఓటు హక్కు కలిగి ఉండటంపై ఆమెను వివరణ కోరింది. ఢిల్లీలోని చాందినీ చౌక్ నియోజకవర్గంలో సునీతా కేజ్రీవాల్ ఓటర్‌గా ఉన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని సాహిబాబాద్ సెగ్మెంట్‌లో సునీతా కేజ్రీవాల్ ఓటర్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1950 ప్రకారం రెండు చోట్ల ఓటర్ గా నమోదు చేసుకోవడం నేరమని.. ఆమెకు కోర్టు సమన్లు ఇచ్చింది. ఈ ఇష్యూ సునీతా కేజ్రీవాల్ ఢిల్లీ సీఎంగా బాద్యతలు చేపట్టడానికి అడ్డంకిగా మారొచ్చంటున్నారు పొలిటికల్ ఎనలిస్టులు.

ఆరోపణలు, కేసులు ఎలా ఉన్నా.. ఆప్ ముందున్న ఒకే ఒక ఆప్షన్ సునీతా కేజ్రీవాల్. ఆమె కాకుండా వేరే ఎవరికైనా బాధ్యతలు అప్పగిస్తే.. ఆరోపణలు, అరెస్టులతో పార్టీకి జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడం కష్టమన్న టాక్ వినిపిస్తోంది. సునీతా కేజ్రీవాల్‌ సారథ్యం వహిస్తేనే తిరిగి ఆప్ క్యాడర్‌లో జోష్ పెరుగుతుందని అంటున్నారు. అవినీతి రహిత పాలన అనే ఎజెండా కంటిన్యూ చేయాలంటే ఐఆర్ఎస్ గా పనిచేసిన సునీతాకేజ్రీవాల్‌తోనే సాధ్యమన్నా వాదనలూ ఉన్నాయి.

ఇప్పటివరకు బీఆర్ఎస్‌ను వీడిన కీలక నేతలు వీరే.. ఇంకా ఏం జరుగుతోందో తెలుసా?