Anand Mahindra : వావ్.. వాటే వాయిస్.. మెకానిక్ పాటకు ఆనంద్ మహీంద్ర ఫిదా

సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర.. ఇవాళ ఓ గాయకుడిని పరిచయం చేశారు. అతడి టాలెంట్ కు ఆయన ఫిదా అయ్యారు. ఎంత అద్భుతంగా పాడుతున్నావ్

Anand Mahindra : వావ్.. వాటే వాయిస్.. మెకానిక్ పాటకు ఆనంద్ మహీంద్ర ఫిదా

Anand Mahindra

Updated On : December 29, 2021 / 7:43 PM IST

Anand Mahindra : సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర.. ఇవాళ ఓ గాయకుడిని పరిచయం చేశారు. అతడి టాలెంట్ కు ఆయన ఫిదా అయ్యారు. ఎంత అద్భుతంగా పాడుతున్నావ్ అని కితాబిచ్చారు.

అసోంలోని మారుమూల ప్రాంతానికి చెందిన ఆ వ్యక్తి ఓ మెకానిక్. వాహనాలకు రిపేరీ చేస్తుంటాడు. కాగా, అతడిలో మరో టాలెంట్ కూడా ఉంది. అతడు అద్భుతమైన సింగర్. మెకానిక్ పని చేస్తూనే పాటలు పాడుతుంటాడు. ఆ మెకానిక్ పాడిన ఓ పాటను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతే, ఆ వీడియో ఒక్కసారిగా వైరల్ గా మారింది. ఈ వీడియోని ఆనంద్ మహీంద్ర సైతం షేర్ చేశారు.

Mark Zuckerberg: వ్యవసాయంలోకి మార్క్ జూకర్‌బర్గ్, రూ.127కోట్లతో స్థలం కొనుగోలు

”వాహనాలను బాగు చేయడానికి ఇతనికి తన గ్యారేజ్ ఉపయోగపడి ఉండొచ్చు. కానీ, అతడి టాలెంట్.. గ్యారేజ్ కు ఆత్మగా మారింది అని” మహీంద్ర ట్వీట్ చేశారు.

1964లో వచ్చిన బాలీవుడ్ మూవీ దోస్తీ సినిమాలోని ”చాహోంగా మే తుఝే సాంజ్ సవేరా” సూపర్ హిట్ సాంగ్. ఆ సాంగ్ నే ఈ మెకానిక్ పాడి వినిపించాడు. కాగా, ఆ మెకానిక్ వాయిస్ కు నెటిజన్లు సైతం ఫిదా అవుతున్నారు. వాటే వాయిస్.. అని కితాబిస్తున్నారు. అద్భుతంగా పాడుతున్నాడని మెచ్చుకుంటున్నారు. అతడి పాట వింటే మీరూ మైమరిచిపోవాల్సిందే.